జూరాల ప్రాజెక్టు కు వరద కొనసాగుతుంది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కారణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 13,200 క్యూసెకులు ఉండగా… ఔట్ ఫ్లో 20,075 గా ఉంది. ఇక నారాయణపూర్ పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుతం 318.140 అడుగులుగా ఉంది. అలాగే పూర్తిస్దాయి నీటి నిల్వ 9.657 టిఎంసీలు కాగా ప్రస్తుతం 8.888 టీఎంసీలు ఉంది. అయితే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నదిలోకి (శ్రీశైలం వైపు) 16,930 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు.