కోవిడ్, ధాన్యం కొనుగోళ్లు రెండింటిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యింది అని వైఎస్ షర్మిల తెలిపారు. ధాన్యం పండించిన రైతులు ఇబ్బందులు పడుతుంటే .. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. మొండి నమ్మకంతో గుండె నిబ్బరంతో సాగు చేస్తున్న రైతులు గుండెలు బాదుకునేలా అరుస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. చివరి గింజ వరకు కొంటానని చెప్పిన తర్వాతే కదా రైతులు సాగు చేసింది. బట్టలు మార్చుకునేంత ఈజిగా మాట మారుస్తారా అని ప్రశ్నించిన షర్మిల 80 వేల పుస్తకాలు చదివి…ఎకరాకు కోటి రూపాయల లాభంతో సాగు చేసే కేసీఆర్ కి రైతు కష్టం తెలియదా అని అన్నారు.
కేసీఆర్ రైతు వ్యతిరేకి… ఖమ్మంలో రైతులకు బెడిలు వేశారు. కేసీఆర్ రైతు ద్రోహి అని తెలిపారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారు. నెల రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకు తరుగు, హమాలి పేరుతో ఎకరాకు 30 వేల నష్టం జరుగుతుంది… ప్రభుత్వం ఇచ్చే 5 వేల రూపాయలు ఎందుకు అన్నారు. మొలకలు వచ్చినా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే. రైతు పొట్ట మీద కొట్టడం భావ్యం కాదు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోము అని పేర్కొన్నారు.