అమరావతిలో దొంగలు పడ్డారా? డబ్బులు.. నగలు.. ఇతర ఖరీదైన వస్తువులు కాకుండా రోడ్డులు ఎత్తుకుపోతున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం అమరావతిలో ఇదే హాట్ టాపిక్. ఈ దోపిడీ కేంద్రంగా రాజకీయ రగడ కూడా మొదలైంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాజధాని కోసం నిర్మించిన రోడ్లను ఎత్తుకుపోతున్నారు! అమరావతి రెండేళ్లుగా నిఘా నీడలో ఉంది. అయినప్పటికీ పోలీసుల కన్నుగప్పి ఈ ప్రాంతంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. వాళ్లు ఎత్తుకు పోతుంది ఇళ్లలోని బంగారమో.. నగదో కాదు. […]
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రతిపక్ష పాత్రకే పరిమితం. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా లాభం లేదట. ఇదే సమయం అనుకున్నారో ఏమో అక్కడ షాడోల పెత్తనం పెరిగిపోయిందట. అసలు కంటే కొసరకే ఎక్కువ డిమాండ్ ఉందట. ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పనికావాలంటే బాబు లేదా శ్రీను దగ్గరకు వెళ్లాల్సిందేనా? శ్రీకాకుళం జిల్లా రాజాం. ఇక్కడి ఎమ్మెల్యే కంబాల జోగులు. 2014లో జిల్లాలో టీడీపీ గాలి వీస్తే రాజాంలో జోగులు వైసీపీ నుంచి […]
ఒక్కొ ఇంటికి 1.80 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. నిర్ధేశించిన మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నాం అన్నారు. ఏపీ వ్యాప్తంగా 9 లక్షల ఇళ్ళు గ్రౌండ్ అయ్యాయి. లేఔట్ల వద్దే లబ్ధిదారులకు ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరా చేస్తాం. పేదల ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పదేపదే అడ్డుపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో జగనన్న కాలనీలు పూర్తి చేస్తాం. జగన్ సర్కార్ కు […]
రాజన్న బిడ్డగా మా నియోజకవర్గంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. షర్మిల దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నా అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది. కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారు. ఉద్యోగాలను వదిలేసి కుటుంబం కోసం ఆలోచిస్తుండు. వైఎస్సార్ గారు మాకు ప్రాణం. బతికున్నంత వరకూ వైఎస్సార్ మా గుండెల్లో ఉంటారు. మునుగోడు ప్రజలకు వైఎస్సార్ ఉదయ సముద్రం ప్రాజెక్టు కట్టించారు. ఆ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు […]
తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరల పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని ప్రశ్నించింది హైకోర్టు. అయితే టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు హైకోర్టు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరుపు న్యాయవాది. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని హైకోర్టు పేర్కొంది. ఇక […]
నేడు భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్ కు కరోనా ఆటంకం కలిగించింది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో లంకలో పర్యటిస్తున్న యువ భారత జట్టులో ఆల్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో నేటి మ్యాచ్ ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈరోజు చేసినా కరోనా పరీక్షలో బీసీసీఐ మెడికల్ బృందం కృనాల్ కరోనా బారిన పడినట్లు అలాగే అతనికి 8 మంది సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించింది. దాంతో […]
సాధారణంగా చోరీ కేసుల్లో పోయిన సొత్తు వస్తుందా లేదా అన్న మీమాంస ఉండేది.. నేటితో అది తొలగిపోయింది అన్నారు సీపీ సజ్జనార్. పొగొట్టుకున్న సొత్తును ఇప్పించాలని చాల రోజులుగా అనుకుంటున్నాను.. ఆ ఇనిషియేటివ్ ఈరోజు సాధ్యం అయింది. దీన్ని రెగ్యులర్ గా నిర్వహించేలా ప్రయత్నం చేస్తాం. 176 కేసులో కోటిన్నర సొత్తును నేడు బాధితులకు తిరిగి ఇస్తున్నాము అని తెలిపారు. కేసు కట్టడం ఒక ఎత్తు అయితే రికవరీ చేయడం ఇంకో ఎత్తు.. విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన […]