తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,978 శాంపిల్స్ పరీక్షించగా… 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 193 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,142 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,70,246 కు పెరిగాయి.. […]
ఆయనో అధికారపార్టీ ఎమ్మెల్యే. వరసగా రెండోసారి గెలిచారు. కాకుంటే కాస్త డిఫరెంట్. పార్టీలో ఉంటారు.. అప్పుడప్పుడూ పార్టీకి గిట్టని పనులు కూడా చేస్తుంటారు. మరోసారి టికెట్ రాదని అనుమానం వచ్చిందో ఏమో .. ముందే జాగ్రత్త పడుతున్నారని ప్రచారం మొదలైంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను అందుకు సంకేతాలుగా చెబుతున్నారు. మరి.. ఆ ఎమ్మెల్యే కొత్తదారిలో ప్రయాణిస్తారా? కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలోనే అసంతృప్తి ఉందా? కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో ఆయన […]
2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో భారత ఆటగాడు అంబటి రాయుడిని తీసుకొనేందుకు చాలా విమర్శలు వచ్చాయి. టీం ఇండియా సెమీస్ లో ఓడిన తర్వాత రాయుడు ఉంటె గెలిచే వాళ్ళం అని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఈ విషయం పై స్పందించారు. జట్టులోకి రాయుడిని ఎందుకు తీసుకోలేదు అనేది తనకు తెలియదు అన్నారు. అయితే ఆ సమయంలో భారత జట్టులో నాలుగో స్థానం పెద్ద […]
దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రెస్టేజియస్ మూవీలో శుక్రవారం హీరోయిన్ పూజా హెగ్డే పార్ట్ షూటింగ్ పూర్తి కాగా, ఈ రోజు విజయ్ సైతం షూట్ కు గుడ్ బై చెప్పేశారు. ‘బీస్ట్’తో కోలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే తన ఫీలింగ్స్ ను ఓ చిన్నపాటి వీడియో ద్వారా తెలియచేస్తే, హీరో విజయ్ దర్శకుడు నెల్సన్ కు ఓ హగ్ […]
టు డేస్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే నాయికగా నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్, దీపికా పదుకునే ఈ మూవీ షూటింగ్ […]
దేశంలో “ఒమిక్రాన్”!వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాసారు. “కొవిడ్” నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న కేంద్రం… కేరళ, […]
సింగరేణిలో సమ్మె సైరన్ మోగడంతో.. కార్మిక సంఘాలు ఒక్కటయ్యాయి. ఒక్కరోజు సమ్మె కాస్తా.. మూడు రోజులకు పెరిగింది. అయితే ఈ సమ్మె ఎవరి కోసం? సమ్మె వెనక ఇంకేదైనా బలమైన ఆలోచనలు ఉన్నాయా? బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్టు చెబుతున్నా.. కార్మిక వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో 3 రోజుల సమ్మె..! తెలంగాణలో నల్లబంగారు గనులు రాష్ట్రానికి సిరులు కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో పదకొండు ఏరియాల్లో విస్తరించిన గనుల్లో 45 […]
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ చేసిన హఠాత్తు ప్రకటన పై చాలా విషయాలు వచ్చిన విషయం తెలిసిందే. కోహ్లీకి మద్దతుగా చాలా మంది అభిమానులు బీసీసీఐ ని తప్పు బట్టారు. ఇప్పుడు అందులో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా చేరాడు. తాజాగా ఈ విషయం పై స్పందించిన కనేరియా… నేను కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం పై మాట్లాడటం లేదు. కానీ తప్పించిన విధానం కరెక్ట్ కాదు అని అన్నారు. […]
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్ నుండి కెప్టెన్ గా తప్పుకున్నాడు. దాంతో తాజాగా బీసీసీఐ… వైట్ బాల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ లు ఉండటం సరికాదని వన్డే కెప్టెన్సీ నుండి కూడా విరాట్ కోహ్లీని తప్పిస్తూ.. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించింది. ఈ విషయాన్ని ఈ నెల చివర్లో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత టెస్ట్ జట్టును ప్రకటిస్తూ వెల్లడించింది. అయితే ఈ టెస్ట్ […]
బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఒక యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్ సిరీస్ గా నిర్మిస్తోంది జీ 5 సంస్థ. బి.బి.సి. స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం. 50 […]