భారత్-ఇంగ్లాండ్ మధ్య నిన్న రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(83) పరుగులు చేయగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(129) సెంచరీతో రెచ్చిపోయాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ(42), జడేజా(40) పంత్(37) పరుగులు చేయగా పుజారా(9), రహానే(1)తో నిరాశపరిచారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు భారత ఆటగాళ్లు డక్ ఔట్ కాగా […]
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,341 సాంపిల్స్ పరీక్షించగా.. 1,746 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 20 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,648 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,58,275 కి చేరింది.. […]
కరీంనగర్ జిల్లా.. వీణవంక మండల కేంద్రములో దళిత బందు పథకం లబ్ధిదారుల ఎంపికలో అనహార్హులు ఉన్నారని గ్రామస్థుల ఆందోళన చేస్తున్నారు. వీణవంక మండల కేంద్రానికి 35 యూనిట్స్ మంజూరు అయ్యాయి. అందులో కేవలం టీఆర్ఎస్ వాళ్ల పేర్లే రాసుకున్నారని తహశిల్దార్ కార్యలయం ముందు అందోళన చేస్తున్నారు. మండలానికి మొత్తం 351యూనిట్స్ మొదటి విడతలొ వచ్చినట్లు రెవిన్యూ అదికారుల వెల్లడించారు. ప్రతి గ్రామంలో అసలైన లబ్ది దారుల ఎంపిక జరగలేదని వివిధ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […]
17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చలనాల కుంభకోణం జరిగిందని గుర్తించాం అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ శేషగిరిబాబు అన్నారు. రూ. 5 కోట్ల మేర నిధులు పక్క దారి పట్టినట్టు గుర్తించాం. రూ. కోటి రికవరీ చేశాం అని తెలిపారు. బోగస్ చలనాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల విషయంలో ఏం చేయాలనే అంశంపై న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసినట్టు ప్రస్తుతం రికార్డుల్లో ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి […]
హైదరాబాద్ 35 వ సెయిలింగ్ వీక్ నిర్వహించడం ఆనందంగా ఉంది. సెయిలర్స్ అందరూ రియల్ ఛాలెంజర్స్ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ట్విన్ సిటీస్ సెయిలింగ్ వీక్ కు అధిత్యం ఇవ్వడం ఆనందంగా ఉంది.హుస్సేన్ సాగర్ లేక్ తెలంగాణ ప్రైడ్ అని తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న సెయిలర్స్ నేత్ర కుమానన్, విష్ణు శరవణన్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి పోటీల్లో ఉన్న సంజయ్ కీర్తి అశ్విన్ అజయ్ కంగ్రాట్స్.. హుస్సేన్ […]
బోగస్ చలనాల కుంభకోణంపై సీఎం జగన్ ఆరా తీశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటికే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు వెల్లడించిన అధికారులు… సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్ ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్ లకు అనుసంధానం చేయడం ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎంకు వివరించారు […]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కబ్జాలు లేవు, రౌడీ షీటర్లు లేరు. లా అండ్ ఆర్డర్ బాగుంది కాబట్టి అన్ని పరిశ్రమలు తరలివస్తున్నాయి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15వేల ఐటీ కంపెనీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్ రాబోతుంది.సెంట్రల్ ప్రభుత్వం తో మాట్లాడుతున్నాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. తద్వారా ఈ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుంది అని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్(RRR) విషయంలో లాండ్ సేకరణ 50 […]
నా రాజకీయ గురువు పెద్ది రెడ్డి. ప్రజలకు అన్నం పెట్టె కులం రెడ్డి కులం. రెడ్డి భవనం కోసం ఎకరం భూమి కోటిరూపాయలు మంజూరు చేసినట్లు హుజురాబాద్ జరిగిన సమావేశంలో గంగుల కమలాకర్ అన్నారు. నేను వ్యవసాయ కుటుంబం లో పుట్టిన వాడినే. నీళ్లు లేక పంటలు వెసుకోలేని రోజుల నుండి బీడుభూములు లేకుండ చేసారు కెసిఆర్. గతంలో పంటలు పండక పోవడంతో ఇంటి తలుపులు తీసుకుపోయాయి బ్యాంకులు. తెలంగాణ రాకముందు రాష్ట్రం గుడ్డి దీపంలాగా ఉండేది. […]
కొందరిని చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతటి అందం సొంతం చేసుకున్నవారిలో కళలు నెలకొని ఉంటే మరింతగా చూసి మురిసిపోతాము. ఆ కళల్లోనూ కరగని వైభవం ఉందంటే, అభిమానంతో కరిగిపోతూ, ఆ కళల నిలయాన్ని ఆరాధిస్తూ ఉంటాము. రాతి గుండెల్లో సైతం కళాభిరుచి కలిగించగల నిపుణులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో సుప్రసిద్ధ నటి, నర్తకి వైజయంతీమాల అగ్రస్థానంలో నిలుచుంటారు. ఓ నాటి తమిళ అందాలతార వసుంధరాదేవి కుమార్తె వైజయంతీ మాల. 1943లో రంజన్ హీరోగా రూపొందిన […]