వారిద్దరూ మాజీ ప్రజాప్రతినిధులు. ఒకరు మాజీ ఎమ్మెల్యే.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్సీ. ఒకే పార్టీ. ఒకే నియోజకవర్గం. నిన్న మొన్నటి వరకు కలిసే ఉన్నా.. ఇగో క్లాష్‌తో గ్యాప్ వచ్చింది. ఒక్కటిగా ఉన్నవారు ఇప్పుడు రెండు దుకాణాలు తెరిచారు. ఎవరి కుంపటి వారిదే. పార్టీ అధికారంలో లేకపోయినా ఓ రేంజ్‌లో అధిపత్యపోరుకు దిగుతున్న ఆ నాయకులెవరో ఈ స్టోరీలో చూద్దాం. రెండు వర్గాలుగా చీలిన మడకశిర టీడీపీ! అనంతపురం జిల్లా టీడీపీ వర్గవిభేదాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే […]
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 87,509 శాంపిల్స్ పరీక్షించగా… 427 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 609 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,715 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,40,065 కి పెరిగింది.. ఇక, […]
‘లక్ష్యాస్ ఫ్రైడే’ అంటున్నాడు నాగ శౌర్య! ప్రతీ శుక్రవారం తమ చిత్రం గురించిన ఏదోఒక అప్ డేట్ ఉంటుందని చెప్పిన చిత్ర యూనిట్ ఈసారి హీరోయిన్ ఫస్ట్ గ్లింప్స్ అందించారు. నాగ శౌర్య సరసన కేతికా శర్మ కథనాయికగా నటిస్తోంది ‘లక్ష్య’మూవీలో. ఆమె ఫస్ట్ గ్లింప్స్ ఆన్ లైన్ లో విడుదల చేయగానే వైరల్ గా మారింది. కేతికకి ‘లక్ష్య’ సినిమాయే డెబ్యూ ప్రాజెక్ట్! నాగశౌర్య, కేతిక జంటగా దర్శకుడు సంతోష్ రూపొందిస్తోన్న చిత్రం ‘లక్ష్య’. ప్రాచీన […]
ఆయనో మంత్రి. జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో అరుదుగా కనిపిస్తారని టాక్. ఇతర జిల్లాల్లో నిర్వహించే ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమన్నది తక్కువే. అలాంటిది ఆ కార్యక్రమంలో మాత్రం ఆసాంతం దగ్గరున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్. ఇంతకీ ఏంటా ప్రోగ్రామ్? ఎవరా మంత్రి? నిర్మలా సీతారామన్ టూర్‌పై ఏపీ ఆర్థికశాఖలో చర్చ! ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పీకల్లోతు ఇబ్బందుల్లో ఉంది. ఎక్కడ అప్పు దొరుకుతుందా.. అని ఆర్థికశాఖ దారులు వెతుకుతున్న పరిస్థితి. కేంద్రం వీలైనంత మేర […]
తెలంగాణ ఇప్పుడు హుజురాబాద్ వైపు చూస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల నుంచి బరిలో దిగేది ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఉపఎన్నికలో దళితబంధుదే కీరోల్ అన్నది అధికారపక్షం ఆలోచన. అలాంటి చోట BSP పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? దళితుల మొగ్గు ఎటు? బీఎస్పీ బరిలో ఉంటే ఎర్త్ ఎవరికి? ప్రస్తుతం దీనిపైనే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హుజురాబాద్‌లో బీఎస్పీ పోటీ చేస్తుందా? ఉపఎన్నిక షెడ్యూల్ రాకుండానే హుజురాబాద్ రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో ప్రచారం హోరాహోరీగా […]
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నాయకుల మధ్య దోస్తీ సాధ్యమా? ఆ ఇద్దరినీ కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? కుస్తీకే ప్రాధాన్యం ఇచ్చి.. ఎవరి ఎత్తుగడలు వారు వేస్తారా? అందరి ఫోకస్ ఆ ఇద్దరిపైనే ఎందుకు ఉంది? రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు! తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా పేరుతో జనంలోకి వెళ్తోంది. ఇంద్రవెల్లి నుండి ప్రారంభమైన దండోరా.. ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో మరో సభకు […]
పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఫ్యాక్టరీ తరలింపు నిర్ణయాలు ఉండచ్చు. చిత్తూరు జిల్లాకు సేవ చేయాలని అనుకున్న దానికంటే ఎక్కువే చేశాను అని అమరరాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు అన్నారు. హైకోర్టులో ఉన్న కేసులపై మాట్లాడటం కరెక్ట్ కాదు. 36 ఏళ్ళుగా ఎంతో నిబద్ధతతో కంపెనీ అభివృద్ధి చేశాము. వేలాదిమందికి ఉద్యోగం అవకాశాలు కల్పించాము. నేను రాజకీయ నాయకుడ్ని కాదు… నేను వ్యాపార వేత్తను… సమాజసేవ కుడిని మాత్రమే అని తెలిపారు. ఇక గల్లా జయదేవ్ […]
నగరంలో ఈ మధ్య కాలంలో బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది ముఠాలుగా ఏర్పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు అని సీపీ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. ఆరు స్టేషన్ ల పరిధిలో జరిగిన బైక్ దొంగతనల్లో 27 మందిని అరెస్ట్ చేసాం. బైక్స్ దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల్లో విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతనికి చెందిన మాలోతు ఎర్రన్నాయుడు తో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసాం. వీరితో పాటు దొంగిలించిన బైక్స్ కొనుగోలు […]
నటీనటులు : సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, శివ పండిట్సాంకేతిక నిపుణులు: సంగీతం : జాన్ స్టేవార్ట్ ఎదూరి, సినిమాటోగ్రఫీ : కమల్‌జీత్ నేగి, ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్, దర్శకత్వం: విష్ణువర్ధన్నిర్మాతలు : కరన్ జోహర్, హిరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా,హిమాన్షు గాంధీనిడివి: 2.15 నిమిషాలువిడుదల: ఆగస్ట్ 12, 2021అమెజాన్ ప్రైమ్ లో గత కొంత కాలంగా బయోపిక్ లకు చక్కటి ఆదరణ లభిస్తూ వస్తోంది. ఆ కోవలో వచ్చిన […]
వివిధ శాఖల సెక్రటరీలతో ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ భేటీ అయ్యారు. ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర పథకాల అమలు.. కేంద్ర నిధుల వినియోగంపై చర్చించారు. సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల హాజరుపై సీఎస్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. సెక్రటేరీయేట్టుకు ఉన్నతాధికారులు రాకుంటే పరిపాలన గాడి తప్పుతుందని అభిప్రాయపడ్డ సీఎస్… ఉద్యోగులు క్రమశిక్షణతో ఉండాలంటే ఉన్నతాధికారులు సచివాలయానికి రావాలన్నారు. హెచ్వోడీ, క్యాంప్ ఆఫీసుల నుంచి పని చేసే విధానానికి సెక్రటరీలు స్వస్తి పలకాలని ఆదేశించారు. […]