విశాఖలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ భారీ జీఎస్టీ మోసంకి పాల్పడింది. శ్రీపాద్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ 69కోట్ల రూపాయలు టాక్స్ ఎగ్గొట్టినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎండీ శ్రీనివాస రెడ్డి ఇంట్లో కంపెనీకి చెందిన అకౌంట్స్, ఇతర డాక్యుమెంట్లు సీజ్ చేసింది ఆదాయపన్ను శాఖ. 2006నుంచి ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నడిపిన శ్రీపాద్ ఇన్ఫ్రా… ఇప్పటి వరకు నాలుగు సార్లు కంపెనీ పేర్లు మార్చి వ్యాపారం చేసాడు. […]
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ లో టీం ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఆతిథ్య జట్టు అయిన ఇంగ్లాండ్ భారత జట్టు మీద ఇన్నింగ్స్ పై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్ప కూలిపోయింది. ఆ తర్వాత తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు 432 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్(121) […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ… పెరుగుతూ వస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో 54,455 శాంపిల్స్ పరీక్షించగా.. 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఒకేరోజు 1,499 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో నేటి వరకు 2,64,71,272 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నమోదైన […]
వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. రేపు రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం అలజడిగా ఉంటుంది. కాబట్టి రేపటి వరకు మత్స్యకారులు […]
ఘన్‌పూర్ నియోజక వర్గంలో 2 పంటలు దిగుబడి వస్తుందంటే కేసీఆర్ చలువే అని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించేది కేవలం తెలంగాణలోనే. కాంగ్రెస్, బీజేపీ ల ఊక దంపుడు విమర్శలు మానుకోవాలి అని హెచ్చరించారు. ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కూడా నేను ఇతరులు మాట్లాడినట్టు మాట్లాడకుండా నాకు పని చేయడమే తెలుసు… సంవత్సరంలో ఇక్కడి పనులు పూర్తి చేయిస్తాను అని తెలిపారు. గౌరవెళ్లి రిజర్వాయర్ […]
ఇంజనీరింగ్ కాలేజీల్లో బి కేటగిరి(యాజమాన్య కోట) సీట్లు నిబంధనలకు విరుద్దంగా కేటాయిస్తున్నారని, కొన్ని కాలేజిలో ఇప్పటికే సీట్లు అమ్ముకున్నారని అడ్మిషన్స్, ఫి రెగ్యులేటరీ కమిటీ కి ఫిర్యాదు చేసింది ఏబీవీపీ. ఈ ఫిర్యాదు పై స్పందించిన ఫీజుల నియంత్రణ కమిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లకు సర్క్యులర్ జారీ చేసింది. ఏ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్ పూర్తి అయ్యాకే యాజమాన్య కోట సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. నోటిఫికేషన్ ఇచ్చే అడ్మిషన్స్ చేపట్టాలి. మెరిట్ ప్రకారమే అడ్మిషన్స్ ఇవ్వాలి. […]
ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదయ్యింది. బలరాంనాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిపై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది కోర్టు. వీరి పై హనంకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని 2018లో కేసు నమోదయ్యింది. కానీ ఈ కేసు విచారణకు హాజరుకానందున ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి హాజరుపరచాలని కోర్టు తెలిపింది. అయితే ఎన్‌బీడబ్ల్యూ జారీతో కోర్టుకు హాజరయ్యారు బలరాం నాయక్. దాంతో బలరాంనాయక్‌పై […]
చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రభుత్వం అప్పులు చేస్తుందన్న విమర్శల పై కౌంటర్ అటాక్ చేశారు. లక్షల కోట్లు అప్పులు చేసి మా నెత్తిమీద పెట్టి హైదరాబాద్ లో కూర్చున్నావ్. జగన్ మీద విశ్వాసం ఉంది కాబట్టే బ్యాంకులు అప్పులిస్తున్నాయి. మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు జగన్ నానా కష్టాలు పడుతున్నారు. అగ్రిగోల్డ్ లో బోర్డు తిప్పేసిన ముసుగువీరులెవరో అందరికీ తెలుసు. నేనిప్పుడు ఆ పేర్లు చెబితే ఏడ్చి […]
మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్గు విజయవంతంగా తన డ్రిల్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అతి త్వరలోనే మరో రిగ్గు ఒ ఎన్ జీ సీ కి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. రానున్నరోజుల్లో మేఘా రిగ్గులు తయారు చేయడం వల్ల దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో రెండు బిలియన్ డాలర్ల విలువ గల మార్కెట్ ను సొంతం చేసుకోనుంది. ఒ ఎన్ జీ సీ కి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో భాగంగా ప్రస్తుతానికి […]
కండువా మార్చినా ఫేట్ మారలేదు. చిన్న పని కూడా కావడం లేదు. పార్టీ పెద్దలు గుర్తించినా లోకల్‌గా ఎమ్మెల్యేతో నిత్యం పోరాటమే. చికాకు తప్ప సంతృప్తి లేదు. చివరకు సొంత గూటిని వదిలి వచ్చి తప్పు చేశామా అని పునరాలోచనలో పడ్డారట ఆ మాజీ మంత్రి. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన ఉన్నట్టు టాక్. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పునరాలోచనలో పడ్డారా? ఫ్యాక్షన్ రాజకీయాలతో ఒకప్పుడు […]