ఈ రచ్చ ఇప్పటిది కాదు… రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. వివాదం కొలిక్కి వస్తుందనుకుంటే… మళ్లీ మొదటికొచ్చింది. టీ కాంగ్రెస్ లో జరుగుతున్న లేటెస్ట్ రచ్చకు కారణమేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో… ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిల మద్య ఒకప్పుడు మంచి మైత్రి ఉండేది. కానీ… రేవంత్ చీఫ్ అయ్యాక సీన్ మారింది. కోమటిరెడ్డి…రేవంత్ మద్య గ్యాప్ పెరిగింది. పిసిసి నియామక సమయంలో టీడీపీ నుండి […]
బీజేపీ సర్కారు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక సంస్కరణ పేరిట మరింత దూకుడు పెంచింది. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎన్నో సంచలనాలకు నాంది పలికింది. జనధన్ ఖాతాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇక రెండోసారి పొత్తుల ఎత్తులతో సంబంధం లేకుండానే బీజేపీకే అత్యధిక సీట్లు వచ్చాయి. దీంతో మోదీ సర్కారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పార్లమెంటులో కీలక బిల్లులను ఆమోదింపజేసుకుంటోంది. అయితే మోదీ సర్కారు దూకుడు […]
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కోమటిరెడ్డి వెంకటె రెడ్డి కలకలం తీవ్రమవుతోంది. పీసీసీ ఆదేశాలను పట్టించుకోకుండా ఆయన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడం.. ఆ తర్వాత పీసీసీపైనే.. నిద్రపోతోందా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే.. ఆయన తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. కాకుంటే.. తనకు తానుగా కాకుండా.. పార్టీనే స్వయంగా వెళ్లగొట్టేలా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే.. కోమటిరెడ్డి మొదటి నుంచీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పుడు.. ఆ […]
వినాయక చవితి మీద విధించిన ఆంక్షలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగర్హం వ్యక్తం చేసారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. రంజాన్, క్రిస్మస్, మొహారం పండుగలపై లేని ఆంక్షలు వినాయక చవితిపై ఎందుకు అని అడిగారు. చర్చిలో ప్రార్థనలు, టీటీడీ లో దర్శనాలు, బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించారు కదా…. వినాయక విగ్రహాలు ఆలయాల్లో పెడితే తప్పా… ఇళ్లల్లో పూజలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పాలా… ఇళ్లలో పూజలకు ప్రభుత్వ అనుమతి అవసరమా అన్నారు. అలాగే […]
ఒక్క భేటీ వంద అనుమానాలకు కారణమైంది. పార్టీ కార్యాలయ శంకుస్ధాపనకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్…ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని కలిశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్… అలాంటిదేం లేదు… కాళ్ల బేరానికి వచ్చారని బిజెపి విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్ చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది. మూడు రోజుల డిల్లీ పర్యటనకు బుధవారం బయలుదేరి వెళ్లారు సియం కేసిఆర్. సెప్టెంబర్ 2 న వసంత్ విహర్ లో పార్టీ […]
నేతలు ఒకవైపు …కేడర్ మరోవైపు. ఇక ఎమ్మెల్యేదైతే అసలు ఏ దారో తెలియదు. ఇది అ నియోజక వర్గంలో అధికారపార్టీ పరిస్థితిపై జరుగుతున్న చర్చ. అధికారంలో ఉన్నా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండటంతో అ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజక వర్గం అధికార వైసీపీలో పెద్ద చర్చకు కారణంగా మారింది. ఇక్కడ 2014 లో ఆదిమూలం పోటీచేసి ఓడిపోయారు. అయినా అధిష్ఠానం […]
వైఎస్ షర్మిల.. గతంలో జగనన్న బాణం. ఇప్పుడు మాత్రం.. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ.. అధికారం లక్ష్యంగా సాగుతున్న పయనం. ఆమె అడుగులు ఎక్కడివరకూ పడతాయి.. లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేక.. చతికిలబడతారా.. అన్నది పక్కన బెడితే.. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ మాత్రం.. వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఒంటరినైపోయానంటూ.. ఆమె వైఎస్ ను తలుచుకోవడం.. చర్చనీయాంశమైంది. ఇక్కడే… ఓ విషయాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. జగన్ సైతం వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత.. ఒంటరిగా నిలిచారని.. […]
పాపం తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వాళ్లు ఒకటి తలిస్తే.. అధిష్టానం ఇంకోటి తలిచినట్టుంది. ఈ గ్రూపుల కొట్లాటలో.. తలదూర్చడం ఎందుకనుకున్నారో ఏమో కానీ.. ఇప్పట్లో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి.. ఈ నెల 8నే గజ్వేల్ లేదా.. నర్సాపూర్ నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించాలని ఆ పార్టీ భావించింది. ఆ తర్వాత 17న తెలంగాణ ఉద్యమ కేంద్రం వరంగల్ లో ముగింపు సభను […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటూ రాజకీయాల్లో.. ఇటూ సినిమాల పరంగానూ బీజీగా మారిపోయారు. ఒకేసారి రెండు పడవలను నడుపుతున్న ‘పవర్ స్టార్’ తొలి నుంచి తనది పాతికేళ్ల రాజకీయమని చెప్పుకొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ అనుభవాన్ని సంపాదిస్తూ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రాజకీయపరంగా చాలా గుణపాఠాలను నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని లైమ్ […]
భారత్‌లో మరోసారి పెరిగాయి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 42,766 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 308 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 38,091 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,88,673 కు పెరగగా.. రికవరీ కేసులు 3,21,38,092కు […]