టీ20 వరల్డ్ కప్ 2021 వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్ లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇక తాజాగా పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఆ జట్టుకు కెప్టెన్ స్టార్ బాట్స్మెన్ బాబర్ ఆజమ్ ను ఎంపిక చేయగా వైస్ కెప్టెన్ గా షాదాబ్ ఖాన్ ను నియమించింది. అలాగే వికెట్ కీపర్ గా మహమ్మద్ రిజ్వాన్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. మరియు గత కొంత కాలంగా పాక్ బౌలింగ్ ను ముందుండి నడిపిస్తున్న షాహీన్ అఫ్రిది కూడా ఈ జట్టులో ఉన్నాడు.
పాకిస్థాన్ జట్టు : బాబర్ ఆజమ్ (c), షాదాబ్ ఖాన్ (vc), ఆసిఫ్ అలీ, అజామ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మహ్మద్ హఫీజ్, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (wk), మొహమ్మద్ వసీం, షాహీన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.