అధికారం కోల్పోయాక ఏ ఒక్క నేతా ఆ నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడలేదట. ఉన్న కొందరూ నచ్చిన దారిని ఎంచుకున్నారు. పార్టీనే నమ్ముకున్నవారి పరిస్థితి ఏంటన్నది టీడీపీ తమ్ముళ్ల ఆవేదన. ప్రస్తుతం దిక్కులేకుండా పోయామని వాపోతున్నారట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? దిక్కులేకుండా పోయామని చిత్తూరు తమ్ముళ్ల ఆవేదన! అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ స్థితి దయనీయంగా ఉందన్నది కేడర్ ఆవేదన. జిల్లా కేంద్రమైన […]
తెలంగాణ కాంగ్రెస్‌లో హైకమాండ్ వేసిన PAC ఏం చేస్తుంది? ఇప్పటి వరకు PCC నిర్వహిస్తున్న సమావేశాలకు.. PACకి తేడా ఏంటి? కొత్త కమిటీనే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుందా.. లేక PAC ఉత్సవ విగ్రహంగా మారుతుందా? కాంగ్రెస్ పీఏసీ రాజకీయ నిర్ణయాలు చేస్తుందా? ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ రగులుతూనే ఉండటం తెలంగాణ కాంగ్రెస్‌లో కామన్. పార్టీలో చాలా మంది సీనియర్లకు పీసీసీ కొత్త కమిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదనే చర్చ ఉంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ […]
వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారాయి. వరుసగా రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో ఆపార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ లోని కీలక నేతలంతా ఎవరి దారి వారు చూసుకోవడంతో ఆపార్టీ నడిపించాల్సి బాధ్యత ‘గాంధీ’ కుటుంబంపైనే పడింది. దీంతో ఆ కుటుంబంలోని ప్రతీఒక్కరు వచ్చే ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని బరిలో దిగుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు ముందు వస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 61,178 శాంపిల్స్ పరీక్షించగా… 1,367 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 14 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,248 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786 కు చేరగా.. 20,06,034 మంది […]
దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టును ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా రాజ్యసభ సభ్యులు […]
వినాయక చవితి ఆంక్షలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఆ జిల్లాలో బీజేపీకి కలిసి వస్తాయా? హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చాక కూడా పార్టీ శ్రేణులు ఎందుకు గొడవలు చేస్తున్నాయి? వినాయక చవితిని అడ్డంపెట్టుకుని గ్రామస్థాయిలో స్థానం కోసం కాషాయ దళం ప్రయత్నిస్తోందా? చవితి ఆంక్షలతో జిల్లాలో బీజేపీ బలపడే వ్యూహం! వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు ప్రకటించినప్పటి నుంచి దూకుడు పెంచింది బీజేపీ. కర్నూలుజిల్లాలో బీజేపీ ఆందోళనలకు దిగింది. అదే సమయంలో బీజేపీ రాయలసీమస్థాయి సమావేశం […]
పార్టీ కమిటీల ఎంపికకు ముందే అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య లొల్లి మొదలైందా? జిల్లాస్థాయి పదవులను తమ నియోజకవర్గానికే కేటాయించేలా ఎత్తుగడలు వేస్తున్నారా? ఈ విషయంలో ఎవరికి వారు చక్రం తిప్పుతున్నారా? ఇంతకీ ఏంటా పదవి? ఏమా గొడవ? అనుచరులకు పదవులు కట్టబెట్టే యత్నం? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు ముక్కలైన తర్వాత.. ఏర్పాటవుతున్న టీఆర్‌ఎస్ కమిటీలకు నలుగురు జిల్లా అధ్యక్షులు రాబోతున్నారు. ఈ విషయంలో జిల్లాల్లో కీలకంగా ఉన్న నాయకులు తెరవెనక పెద్ద మంత్రాంగమే నడుపుతున్నారట. మంత్రి […]
మాజీ విద్యార్థి నాయకుడు .. సీపీఐ నేత కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అందుకే రాహుల్‌గాంధీని కలిశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ పరిశీలకుల నుంచి. JNU students Uninion మాజీ అధ్యక్షుడైన కన్నయ్య కుమార్ మంచి వక్త. మోదీ పాలనపై తరచూ విరుచుకుపడుతుంటాడు. మంచి వాగ్ధాటి కలిగిన యువనేత. అందుకే కాంగ్రెస్ పార్టీ కన్నయ్యపై కన్నేసినట్టు కనిపిస్తోంది. కన్నయ్య కుమార్‌తో పాటు గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కూడా కాంగ్రెస్ లోకి […]
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టుగా తయారైంది TTD పరిస్థితి. ఏకంగా 75 మందితో బోర్డు ఏర్పాటుకు కసర్తతు పూర్తయింది. ఇదే TTDకి సంకటంగా మారినట్టు టాక్. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా.. అంతమంది పాలకమండలి సభ్యులను సంతృప్తిపర్చడం TTDకి పెద్ద సవాలేనా? ఒత్తిళ్లతో ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య పెరిగిందా? తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ఎట్టకేలకు పూర్తయింది. సంప్రదాయాలను పక్కన పెట్టి.. 75 మందితో బోర్డు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 25 మంది బోర్డులో ఉంటారు. […]
టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి… మళ్లీ హైదరాబాద్ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయడంతో…హెచ్‌సీఏకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. తొలుత హైదరాబాద్ తరఫున రంజీ పోటీల్లో పాల్గొన్న విహారి.. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యల కారణంగా… ఆంధ్రాకు తరలి వెళ్లాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పర్యటనకు ఎంపికైన విహారి.. కేవలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమ్యాడు. కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధంతరంగా రద్దు కావడంతో… […]