హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే పడింది. సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారిపోయింది. రేసులో ఎంతమంది ఉన్నా వారంతా థర్డ్ ప్లేసుకోసమో పోటీ పడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ లేదంటే బీజేపీ అభ్యర్థి మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక రిజల్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈటల రాజేందర్ అసైన్డ్ […]
ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య నలిగిపోతున్నారు అధికారులు. ఏ పని చేస్తే ఎవరు విరుచుకుపడతారో తెలియక ఆందోళన చెందుతున్నారట. ఈ టెన్షన్ అంతా ఒక సర్టిఫికెట్ కోసం. దానిపైనే పెద్ద పొలిటికల్ ఫైటే జరుగుతోంది. రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దుగ్గిరాలలో క్యాస్ట్ సర్టిఫికెట్ రగడ..! కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల పొలిటికల్ పంచాయితీకి ఈ సామెత చక్కగా సరిపోతుంది. దుగ్గిరాల మండల పరిషత్ ఎన్నిక కోసం […]
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి అందరికి తెల్సిందే. ఆమె స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇప్పుడిప్పుడే ప్రజల్లో గుర్తింపు దక్కుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని ప్రకటించిన షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రారంభించిన ఆరునెలల్లో తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య, యువత ఆత్మహత్యలు, రైతు సమస్యలపై గళం విప్పుతున్నారు. యువత నుంచి […]
గత కొన్ని నెలలుగా హుజూరాబాద్ …రాష్ట్ర రాజకీయ కేంద్రంగా మారింది. ఈటెల ఎపిసోడ్‌తో ప్రారంభమైన పొలిటికల్ హీట్ వేవ్, షెడ్యూల్ విడుదలతో పీక్ కి చేరింది. హుజురాబాద్ ఉప ఎన్నికను రెండు పార్టీల మధ్య పోరాటంగా జనం భావించట్లేదు. ఈటెల వర్సెస్ కేసీఆర్‌గానే చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా ఈ మాటే అంటున్నారు. అందుకే ఇది ఈటెల వర్సెస్ కేసీఆర్ గా మారింది. అరుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఈటెలకు గ్రామ గ్రామాన అనుచర వర్గం వుంది. […]
ఢిల్లీ పర్యటనలో స్పెషల్ మిషన్‌పైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారా? ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్‌లో పలుమార్లు కేంద్రం చెప్పినా.. ఆయన ఫోకస్ ఆ అంశంపైనే ఉందా? తాజా హస్తిన టూర్‌లోనూ ఆ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారా? మరి.. త్వరలో క్లారిటీ వస్తుందా? ఇంతకీ ఏంటా అంశం? నియోజకవర్గాల పెంపు ఢిల్లీ టూర్‌లో ప్రస్తావించారా? పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలి. ఇదే […]
ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగన్దినా అన్నట్లుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అవిశ్రాంతంగా ముందుకు సాగుతుంది. మానవ మనుగడకు నేను సైతం అనే చేతులన్నీ ఒక్కటై మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. మరో మూడు హృదయాలను కదిలిస్తున్నాయి. స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రపంచమంత కదలిస్తుంది. ఈ క్రమంలోనే, ఈ రోజు శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్ డా. డి వెంకటేశ్వరన్ “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ పార్క్ […]
శ్రీవారి దర్శనానికి TTD అనేక వెసులుబాటులు కల్పించింది. ఆర్థిక స్థోమత.. పరిచయాల ఆధారంగా తమకు వీలైన మార్గాన్ని ఎంచుకుంటారు భక్తులు. కాకపోతే వెసులుబాటులను లాభసాటి వ్యాపారంగా చూసేవారు కూడా కొందరు ఉన్నారు. ఈ విషయంలోనే విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా ఉండాలి. కానీ.. ఓ ఘటనలో TTD విజిలెన్స్ ఇచ్చిన ప్రకటన.. చర్చగా మారింది. ఆలయ పరిపాలనపై విజిలెన్స్‌కు అవగాహన లేదా అనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చింది ఆ ప్రకటన. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. శ్రీవాణి ట్రస్ట్ […]
త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఈ పోరులో ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని పరిశీలకు బావిస్తున్నారు. దుబ్బాక కన్నా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుందని బావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, టీఆర్‌ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాతా రెడ్డి మధ్య జరిగిన హోరీ హోరీ […]
ఈ రోజు తూర్పు గాలులలోని అవర్తనము ఆగ్నేయ బంగళాఖాతం నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ ఉత్తర ఝార్ఖండ్ మరియు పరిసర బీహార్ ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 7.6కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా ప్రదేశములలో, రేపు అనేక ప్రదేశములలో […]
మాంచెస్టర్ సిటీతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పీఎస్‌జీ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ గోల్ సాధించడంతో పారిస్ నగరం దద్దరిల్లింది. రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ.. పీఎస్‌జీ తరఫున తన తొలి గోల్ సాధించి జట్టుకు 2-0తో విజయాన్ని అందించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. తమ ఆరాధ్య ఆటగాడు తొలిసారి తమ క్లబ్ తరఫున గోల్ చేయడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 74వ నిమిషంలో ఎంబపే అందించిన అద్భుతమైన పాస్‌ను మెస్సీ […]