Pantham Nanaji: కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే పంతం నానాజీ
- కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే పంతం నానాజీ
- డాక్టర్‌ను తిట్టినందుకు రేపు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pantham Nanaji: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, బూతులు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ కంటతడి పెట్టుకున్నారు. డాక్టర్‌ను తిట్టినందుకు రేపు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. నిన్న ఆవేశంతో తప్పుగా మాట్లాడానని ఆయన క్షమాపణలు చెప్పారు. తాను వైద్య వర్గాన్ని ఉద్దేశించి అలా మాట్లాడలేదు.. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. కోపంలో బూతులు వచ్చేశాయని పేర్కొన్నారు. తీరా చూస్తే ఈయన నా స్నేహితుడే.. వైద్య వృత్తికి క్షమాపణలు చెప్తున్నాను అని ఎమ్మెల్యే ప్రకటించారు.
Read Also: Tragedy: విహారయాత్రలో విషాదం.. వాటర్‌ఫాల్స్‌లో ఐదుగురు మెడికల్ విద్యార్థులు గల్లంతు
Also Read
“ఒక ప్రజా ప్రతినిధి ఎలా ఉండకూడదో నిన్న నేను అలా ఉన్నాను. ఇలాంటి విషయాలలో నన్ను ఎవరు ఆదర్శంగా తీసుకోకూడదు. ఎవరో తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. నేను తప్పు చేశాను కాబట్టి రేపు నేను ప్రాయశ్చిత దీక్ష చేస్తాను. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మా ఇంటి దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకుంటాను” అని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు