New Zealand: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవులను గురువారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం తాకింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అంచనా. 300కిమీ వ్యాసార్థంలో సమీపంలోని, జనావాసాలు లేని ద్వీపాలకు యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ద్వారా సునామీ హెచ్చరిక కొద్దిసేపటి తర్వాత జారీ చేయబడింది. భూకంపం కారణంగా న్యూజిలాండ్‌కు సునామీ ముప్పు లేదని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.
Read Also: MQ-9 Reaper: ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ప్రత్యేకతలేంటో తెలుసా?
ప్రపంచంలోని రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లు – పసిఫిక్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్ సరిహద్దులో ఉన్నందున న్యూజిలాండ్ తరచుగా భూకంపాలకు గురవుతుంది. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలువబడే తీవ్రమైన భూకంప కార్యకలాపాల జోన్ అంచున కూడా ఉంది. ప్రతి సంవత్సరం, న్యూజిలాండ్‌ను వేలాది భూకంపాలు వణికిస్తున్నాయి. న్యూజిలాండ్ గత నెల 15న భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్‌టన్ సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. పరంపరౌము నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని అధికారులు గుర్తించారు.