Manipur: సీఎం పాల్గొనబోతున్న కార్యక్రమ వేదికకు నిప్పు.. ఆ జిల్లాలో ఇంటర్నెట్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ పర్యటనకు ముందు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడాన్ని ఆ రాష్ట్ర సర్కారు నిషేధించింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన నేపథ్యంలో ఓ మూక సీఎం ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం పాల్గొనబోయే కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టింది. గురువారం రాత్రి చురచాంద్‌పూర్ జిల్లాలోని న్యూ లంకాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఆ వేదికపై ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూర్చోవాల్సి ఉంది. కానీ గురువారం రాత్రే దానిని తగులబెట్టారు. అక్కడే ముఖ్యమంత్రి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న జిమ్ కూడా పాక్షికంగా ధ్వంసం అయింది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి.. ఆ మూకను చెదరగొట్టారు. కానీ వేదికతో పాటు వందలాది కుర్చీలు ధ్వంసమయ్యాయి.
Read Also: Rahul Gandhi: రాహుల్‌గాంధీకి బాంబు బెదిరింపులు.. 60 ఏళ్ల నిందితుడు అరెస్ట్
Also Read
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
- Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం, ప్రజాశాంతి భంగం, మానవ ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చురాచంద్‌పూర్ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ థియెన్‌లత్‌జోయ్ గాంగ్టే గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ తాము ప్రభుత్వానికి ఎన్నో వినతిపత్రాలు అందించామని ఆ ఫోరమ్ చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడానికీ అయిష్టత చూపెట్టిందని వివరించింది. అందుకే సీఎం పర్యటన నేపథ్యంలో చురచాంద్‌పూర్ బంద్‌కు పిలుపు ఇచ్చింది.
తాజావార్తలు
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
-
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
-
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
-
BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!