Rahul Gandhi: గతేడాది భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించబోతున్న సందర్భంలో రాహుల్ గాంధీకి ఓ బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇండోర్‌లోకి ప్రవేశించిన వెంటనే ఆయనపై బాంబ్ వేస్తానని బెదిరిస్తూ రాసిన లేఖ అదే నగరంలోని ఓ స్వీట్ షాప్ ఎదురుగా లభించింది. ఈ ఘటనపై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఆ లేఖ రాసి రాహుల్ గాంధీని బెదిరించిన 60 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.60 ఏళ్ల దయాసింగ్ అలియాస్ ఐశిలాల్ ఝామ్‌ను దేశ భద్రతా చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఐశిలాల్ ఝామ్ మరికాసేపట్లో రైలు ఎక్కి పారిపోతున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు.
Read Also: US Army Helicopters: కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు
దేశ భద్రతా చట్టం కింద ఐశిలాల్ ఝామ్‌ను జైలుకు పంపించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్టు క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నిమిష్ అగ్రవాల్ తెలిపారు. నిందితుడు రాహుల్ గాంధీకి ఎందుకు లేఖ పంపాడనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అగర్వాల్ అన్నారు.గతేడాది నవంబర్‌లో ఈ లేఖ బయటపడగానే పోలీసులు ఐపీసీలోని 507 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మధ్య ప్రదేశ్ పోలీసులు అప్పుడే దర్యాప్తు ప్రారంభించారు.