టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాను ఏం చేసినా భాజాభజంత్రీలు కొట్టే మీడియా ఉందన్న ధైర్యం చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.
మొదటి వారంలోనే అందరి మన్నలను పొందిన బిజినెస్ రియాలిటీ షో - నేను సూపర్ ఉమెన్. ఆహా, వి హబ్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ షోలో ఏంజెల్స్ - సుధాకర్ రెడ్డి, రేణుక బొడ్ల, డాక్టర్ సింధూర నారాయణ, రోహిత్ చెన్నమనేని, శ్రీధర్ గాది రెండో వారంలో 1.65 కోట్లు ఇన్వెస్ట్ చేసారు.
పుట్టిన 7 నెలలకు చిన్నారి కడుపు బాగా ఉబ్బి.. అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు బాలుడిని పరిశీలించారు. తీరా చూస్తే 7 నెలల బాలుడి కడుపులో పిండం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో బాలుడికి ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించారు.
భారతీయ మార్కెట్‌లలో టమాటా ధరలు మండిపోతుండగా.. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల విక్రయదారుడు కన్నీళ్లు పెట్టిన వీడియో సామాన్య ప్రజలను కూరగాయల ద్రవ్యోల్బణం ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో వెలుగులోకి తెచ్చింది.
థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం థాయ్‌లాండ్‌లోని బాణసంచా గోదాములో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
డెడ్ శాటిలైట్‌ను తొలిసారిగా భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. ఒక యూరోపియన్ ఉపగ్రహం ఇంధనం అయిపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయేలా తయారు చేయబడింది. ఏయోలస్ అనే పేరుతో, 1,360 కిలోల కంటే ఎక్కువ బరువున్న వాతావరణ పర్యవేక్షణ అంతరిక్ష నౌకను 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది.
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ జస్టిస్ ఉపాధ్యాయ్‌తో ప్రమాణం చేయించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను పామ్ అవెన్యూ నివాసం నుంచి గ్రీన్ కారిడార్ ద్వారా తరలించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ స్థలంలో మృతదేహాలు ఏవీ కనుగొనబడనప్పటికీ దాదాపు నాలుగు నుంచి ఆరుగురు నక్సలైట్లు మరణించారని సమాచారం.