టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టి డోపింగ్‌లో దొరికిపోయినట్లయింది చంద్రబాబు పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడు అంటూ ఆయన ప్రశ్నించారు.
ముందస్తు సార్వత్రిక ఎన్నికలను పిలిచే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తన పదవీ కాలం చివరి రోజు వరకు భారత పౌరులకు సేవ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు.
కర్ణాటకలో ఓ టీచర్ క్లా్స్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్‌కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
చిరకాల ప్రత్యర్థులు భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదికైంది. దాయాది జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం పోరులో తలపడనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మల్టిపుల్ డిజేబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల బైపిళ్ళ నారాయణ నిఖిల్‌కు సీఎం జగన్ ఆర్థిక సహాయం చేశారు.
సమస్యల పరిష్కారానికి ఆయుధాలు ఉపయోగించే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయని, అయితే ఇక్కడ హింసను అరికట్టేందుకు చర్చలు, సహన సంస్కృతిని అవలంభిస్తున్నామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.