చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎవ్వరుబడితే వారే మాట్లడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రెండవ రోజు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. చంద్రబాబు హెల్త్ బులెటిన్‌నుసెంట్రల్ జైల్ ఇంఛార్జి సూపరిండెంట్ రాజ్‌కుమార్ విడుదల చేశారు.
పేద వారికి అభివృద్ధి చేయాలంటే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అక్కర్లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాటిస్తే మాట నిలబెట్టుకునే తత్త్వం సీఎం జగన్‌ది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రేపు, ఎల్లుండి నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల ఎత్తు కొలిచే పరికరాల్లో తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
చంద్రబాబు భద్రత, ఆరోగ్యానికి సంబంధించి జైల్లో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. జైల్లో చంద్రబాబుకు ఆరోగ్యపరంగా, భద్రతాపరంగా ఎలాంటి సమస్య లేదన్నారు. మొదటి నుంచి ఆయనను హైప్రొఫైల్ ఖైదీగానే ట్రీట్ చేస్తున్నామన్నారు.
ఏపీలో లోకల్స్, నాన్ లోకల్స్ మధ్య పోరాటం జరుగుతోందని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వాళ్లకు సమర్ధించే వాళ్ళంతా నాన్‌లోకల్సేనని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలు సమర్థిస్తున్నారని ఆయన చెప్పారు.