దారి దోపిడి కేసులో పంజాగుట్ట పీఎస్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సర్వీసు నుంచి తొలగించారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ పేరుతో 18.50 లక్షల నగదును ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్ కాజేసినట్లు విచారణలో తేలింది.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందని ఆయన అన్నారు. అవినీతిపరుల పార్టీగా మారిందని మంత్రి విమర్శలు గుప్పించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా అభ్యర్థుల ప్రకటనతో అసమ్మతి నేతలు తెరపైకి వచ్చారు. మూడు నియోజకవర్గాల్లో అసమ్మతి స్వరం పెరుగుతోంది.
కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కామారెడ్డి జిల్లా జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దాని సభ్యులందరికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఇస్తుంది. దీని సహాయంతో ఎవరైనా తమ పీఎఫ్ ఫండ్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరైనా పీఎఫ్ డబ్బులను కూడా తీసుకోవచ్చు.
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎస్ డిసెంబర్‌లో 4G సేవలను చిన్న స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మా మద్దతు పలుకుతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో మాదిగల విశ్వరూప మహా సభలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటాల తూటాలు అధికమవుతున్నాయి. తాగా నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై బీఆర్‌ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు.
కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ చిచ్చు జరుగుతోంది. ఆదివాసీలకు అన్యాయం చేశారంటూ టికెట్ ఆశించిన మర్సుకోల సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.