నిధుల కేటాయింపులో వివక్ష, నిర్లక్ష్యంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు తమ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడు డీఎంకే గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టనున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘శ్వేతపత్రం’కు ప్రతిగా కాంగ్రెస్ పార్టీ ‘బ్లాక్ పేపర్’ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్' ప్రస్తావనకు రానుందని సమాచారం.
తమ విభేదాలను పక్కనబెట్టి, షెడ్యూల్డ్ కులాల కోటాలో రిజర్వేషన్లు నిరుపేదలు, అత్యంత బలహీన వర్గాలకు రిజర్వేషన్లలో ఎక్కువ వాటాను అందజేస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం ఏకగ్రీవంగా సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ అన్నారు. భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యాంటీబయాటిక్స్‌ని అనవసరంగా వాడకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక చర్యలు చేపట్టింది. మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు, మంత్రిత్వ శాఖలోని విభాగాలు వారి స్థాయిలో అవగాహన ప్రచారాలను కూడా నిర్వహిస్తున్నాయి.
ఇమ్రాన్‌ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత శక్తివంతమైన ఆల్‌రౌండర్లలో ఒకడు. బ్యాట్, బంతితో ఎప్పుడైనా ఆట గమనాన్ని మార్చగల సత్తా అతనికి ఉంది. రిటైర్మెంట్ తర్వాత బంతికి దూరమైన ఆయన నుంచి బ్యాట్‌ను బలవంతంగా లాక్కుంది ఎన్నికల సంఘం.
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు గురువారం ఓటింగ్ జరగనుండగా, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సైన్యం మద్దతు ఉందని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బుధవారం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఎన్నికల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న జంట బాంబు పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు.
ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్‌లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్య కుమార్, తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ నుండి అయోధ్యకు వెళుతున్న మొదటి రైలు ఇదేనని.. వేలాది మంది భక్తులను అయోధ్యకు పంపిస్తున్న పుణ్యం ఏపీకి దక్కుతుందన్నారు.
ఏపీలో వైద్యరంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు నేడు పథకం అమలు చేశామని మంత్రి తెలిపారు. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ 16,852 కోట్లు వ్యయం చేశామని ఆయన వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్యం తెచ్చామని మంత్రి పేర్కొన్నారు.