Kurnool: కర్నూలులోని ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్యాస్ట్రో ఏంట్రాలజి వార్డు సమీపంలో కోసిన నిమ్మకాయలు, రంగు దారాలు, ఆకులు, వక్క చీటీలు కనిపించడంతో ఆస్పత్రిలోని సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని మూడు వరుసల్లో పెట్టారు. ఆసుపత్రిలో ఉన్న రోగికి నయం కావాలని ఈ పూజలు చేశారా, ఎవరికైనా చెడు జరగాలని చేసారా అనే అనుమానాలు అక్కడి వారిలో వ్యక్తం అవుతున్నాయి. రాత్రి వేళ చీకట్లో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేసినట్లు తెలిసింది. మధ్యాహ్నం వరకూ కూడా తొలగించకపోవడంతో భయపడుతూ వైద్య సిబ్బంది, రోగుల సహాయకులు అటు, ఇటు తిరిగారు.
Read Also: Uma Harathi IAS: ఐఏఎస్ అధికారిణిగా కుమార్తె..సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి