మద్యం కోసం ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు కొందరు ఆకతాయిలు. ఈ దారుణ ఘటన చిత్తూరులో బుధవారం జరిగింది. బుధవారం నాడు చిత్తూరులోని ఇందిరానగర్ సమీపంలో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
MK Meena: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుక పంపిణీ విషయంలో రోజువారీ సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వర్షాకాలం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే, తరువాతి కాలంలో ఇసుక లభ్యత పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆదేశాలతో శుక్రవారం జిల్లా కలెక్టర్లతో అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానం, సెప్టెంబర్ 11వ తేదీ నుంచి రానున్న నూతన విధానాలపై సచివాలయం […]
వైసీపీలో ఇమడలేక చాలా మంది మా వైపు వస్తామంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని మీడియా చిట్‌చాట్‌లో ఆయన తెలిపారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయన్నారు.
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది.
కోటి చెట్లు పెట్టాలని సంకల్పించామని.. కోటి చెట్లు పెడితే 0.33 శాతం మేర గ్రీన్ కవర్ పెరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. చెట్లు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టాలని సూచించారు. మంగళగిరిలోని ఎకోపార్క్‌లో వనమహోత్సవాన్ని మొక్కలు నాటి ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు. స్కూళ్లల్లో చెట్లకు నీళ్లు పోయడమనేది అలవాటు చేసేవారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పచ్చదనం పెరిగితే స్వర్ణాంధ్ర ప్రదేశ్ కావడం ఖాయమన్నారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
మంగళగిరి ఎకో పార్కులో వన మహోత్సవాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కలిసి ప్రారంభించారు. ఎకో పార్కులో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు.
ఏపీలో పలువురికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు రాగా.. వారికి పోస్టింగులు కూడా కేటాయించారు. ఏఎస్పీలుగా ఉన్న ఏడుగురికి నాన్ కేడర్ ఎస్పీలుగా ప్రమోషన్లు లభించాయి.
కృష్ణా జిల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.