10 మంది రాజ్యసభ సభ్యులు బయటకి వెళ్లిపోతున్నారు అనే ప్రచారం అవాస్తవమని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఒకరిద్దరు బయటకి వెళ్లినా మాకు నష్టం లేదన్నారు. మిగిలిన వాళ్లం పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తామన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వైసీపీ రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చేయడం లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి తాను జగన్ వెంట ఉన్నానని.. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచానని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తు్న్నారు. .. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్ ఫ్లో 2,86,434 క్యూసెక్కులు ఉండగా.. 10 గేట్లు ఎత్తడంతో ఔట్ ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది.
దేశంలో నాల్గవ భాష తెలుగు, పదికోట్ల మంది మాట్లాడే భాష తెలుగు.. అమెరికాలో తెలుగు 11వ భాష.. అదీ తెలుగువారి సత్తా.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు గొప్పదనం గురించి కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు.
విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులు రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నామన్నారు.
రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌కు రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది.
జగన్‌ను రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం కోసం మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని మాదీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ ఆషాఢ భూతి అని.. నమ్ముకున్న వాళ్లను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని ఆషాఢ భూతి అంటారని ఆయన అన్నారు.