చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో ప్రముఖ నిర్మాత , దర్శకుడు పి. సోమశేఖర్ మృతి చెందారు. ఈయన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సోదరుడు అవుతారు. ఆయన పలు సినిమాలకు కూడా పనిచేశారు. రంగీలా, దౌడ్, సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హిందీలో ముస్కురాకే దేఖ్ జరా అనే మూవీకి దర్శకత్వం వహించారు. సోమశేఖర్.. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలా కాలంగా వర్మకు దూరంగా ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా సోమశేఖర్ మృతి పలుగురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.