తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి..తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2242 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఇదే సమయంలో 4693 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,53,277 కు చేరగా.. ఇప్పటి వరకు 5,09,663 కు మంది కోవిడ్ సోకి కోలుకున్నారు. మరోవైపు కోవిడ్‌తో ఇప్పటి వరకు 3125 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40,489 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. రికవరీ రేటు రాష్ట్రంలో 92.11 శాతంగా ఉంటే.. దేశంలో 88.3 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు.