ఈటల రాజేందర్ పై టీఎంయు జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని..మరొకసారి ఆర్టీసీ గురించి గాని, కవిత గురించి మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. కవితను టీఎంయు అధ్యక్షురాలుగా ఉండాలని మేము కోరాము, మా అధిష్టానం ఒప్పుకుంటే మీ ప్రతిపాదనను అంగీకరిస్తానని కల్వకుంట్ల కవిత అన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని రక్షిస్తున్నారని…ఆర్టీసీని అదుకున్నది కేసీఆరే అని పేర్కొన్నారు. ఆర్టీసీపై ప్రేమతో బడ్జెట్ లో కేసీఆర్ 3 వేల కోట్లు పెట్టారని..ఈటల రాజేందర్ తన స్వప్రయోజనాల కోసం ఆర్టీసీపై, కల్వకుంట్ల కవితపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటల ఆర్థిక మంత్రిగా ఉండి మాకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు.