తాడిపత్రి అర్జాస్ స్టీల్స్ వద్ద 500 బెడ్ల కోవిడ్ తాత్కాలిక ఆసుపత్రిని వర్చువల్ ద్వారా క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కేవలం రెండు వారాల రికార్డు సమయంలో 11.50 ఎకరాల విస్తీర్ణం, లక్ష చదరపు అడుగులు, అత్యాధునిక సౌకర్యాలతో కోవిడ్ హాస్పిటల్ ను సిఎం జగన్ ఆదేశాలతో నిర్మించారు. ప్రతీ పేషెంట్ బెడ్ వద్ద ఆక్సీజన్, ప్రతీ 30 బెడ్లకు నర్సింగ్ స్టేషన్, 200 మంది నర్సులు, 50 మందికి పైగా డాక్టర్లు, […]
వచ్చే వారమే బీజేపీలో చేరుతానని ఈటల పేర్కొన్నారు. నేను వామపక్ష, లౌకిక వాదిని… కానీ పరిస్థితులు తనను బిజేపి వైపునకు తీసుకెళ్ళాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ? రాష్ట్రంలో సీపీఐ పార్టీ పోటీలో ఉండాలా లేదా అన్నది ఎవరు డిసైడ్ చేస్తున్నారు ? అనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు టిఆర్ఎస్ ప్రయతించిందని… ఇప్పటికే హుజురాబాద్ నియోజవర్గంలో టిఆర్ఎస్ 50 కోట్లు […]
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తు, గులాబీ జెండా గుర్తుతో గెలిచిన విషయాన్ని మంత్రి ఈటెల రాజేందర్ గుర్తుంచుకోవాలని… తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పని చేశారని… వారంత కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించారని పేర్కొన్నారు. అందులో ఈటెల ఒక్క కార్యకర్త మాత్రమే…టీఆర్ఎస్ పెట్టిన తర్వాత 2003 లో ఈటెల జాయిన్ అయ్యారని చురకలు అంటించారు. కేసీఆర్ తమ నాయకుడు అని.. ఆయన నాయకత్వంలో పని చేసేందుకు నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, […]
ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లోనూ బిజేపిలో చేరుతున్నట్లు ఈటల ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈటల ఎప్పుడు బిజేపిలో చేరుతారనే దానికిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 11 తర్వాత బీజేపీలో ఈటల చేరనున్నారని తాజాగా సమాచారం అందుతోంది. అంతలోపే స్పీకర్ కు రాజీనామాను మెయిల్ చేయనున్నారు ఈటల. ఈటల చేరికపై ఇప్పటికే హుజురాబాద్ బీజేపీ నేతలతో మాట్లాడారు బండి […]
ఈటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది టీఆర్ఎస్. ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు ఈటల. అయితే ఈటల వ్యాఖ్యలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల ప్రయత్నాలు ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందిని కెసిఆర్ నాయకులుగా తయారు చేశారని.. అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై సిఎం కెసిఆర్ స్పందించారంటే అది నియంతృత్వం […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 11,421 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,25,682 కు చేరింది. ఇందులో 15,75,557 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,38,912 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. […]
దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుం బిగించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో కార్యాలయం యందు రైతులందరికీ, హమాలీ, చాట, సడెం, దడువాయి అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల […]
విశాఖ మధురవాడ పరిధిలోని మారీక వలసలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 3 సంవత్సరాల చిన్నారిని కన్న తల్లి హతమార్చింది. అంతే కాదు గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో దహనం చేసింది. రెండు రోజుల నుంచి పాప కనిపించకపోవడంతో వరలక్ష్మీని స్థానికులు నిలదీశారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందుతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల సమక్షంలోనే నింధుతురాలు వరలక్ష్మీపై దాడికి ప్రయత్నించిన స్థానికులు.. రెండురోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించింది చిన్నారి. […]