షర్మిల పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా తెలంగాణ వైయస్సార్ అభిమానులకు వైఎస్ షర్మిల గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు వైఎస్ షర్మిల లోటస్ పాండ్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పుట్టినరోజు అయిన జులై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. పార్టీ ఆవిర్భావానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్రెడ్డి సంక్షేమ పాలనను మరోసారి తెలంగాణలో తీసుకురావడమే లక్ష్యంగా తమ పార్టీ ఏర్పడుతుందని షర్మిల బృందం పేర్కొంది.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Tags
- july 8th
- party
- telangana
- YS Sharmila
- ysr
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!