మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు కప్పి పుచ్చుకోవడానికి…నిర్లక్ష్యాన్ని కేంద్రంపై మోపుతున్నారని… కేటీఆర్ కళ్లు ఉన్నోడు అయితే ఇలాంటి విషం చిమ్మడని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే కుళ్లు మనస్తత్వం కేటీఆర్ ది అని.. భారత్ బయోటెక్ ను వాళ్ళు విజిట్ చేశారా.. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసారా? అని నిలదీశారు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. ట్విట్టర్ మంత్రిగా మారిపోయారు… హైటెక్ మంత్రిగా గొప్పలు చెప్పుకుంటున్నాడని.. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసా ? అని ప్రశ్నించారు. పీఎం బయోటెక్ ను సందర్శించడం జీర్ణించుకోలేక పోతున్నారని…పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ కు వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఇచ్చామో తెలియదా ? అని నిలదీశారు. 35 వేల కోట్ల రూపాయలు ఒక్క రోజే ఖర్చు చేస్తారా? defacto సీఎం గారు సమాధానం చెప్పాలని చురకలు అంటించారు. ఉమ్మడి జిల్లా జనాభా అంత లేని దేశాలతో భారత దేశాన్ని పోల్చుతున్నాడని.. విదేశీ వ్యాక్సిన్ దేశంలోకి రావడానికి నిబంధనలు ఉండవా ? అని ప్రశ్నించారు. మన దేశ వ్యాక్సిన్ కన్నా ఎక్కువ రేటు ఆ వ్యాక్సిన్ లకు ఉందని.. మీ లాంటి వాళ్లు జేబులు నింపుకోవడానికి తెమ్మంటున్నరా అని నిలదీశారు. మోడీ ఇమేజ్ ను దెబ్బ తీయడానికి ఇలాంటి ప్రయత్నాలు అని…. కుళ్లు రాజకీయాలు సరికాదన్నారు. వ్యాక్సిన్ ఎక్కువ వృధా చేసిన రాష్ట్రం తెలంగాణ అని.. చిల్లర రాజకీయాలు వద్దని హెచ్చరించారు డీకే అరుణ.