తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. ‘క్యూ హో గయా నా’ చిత్రంలో తొలిసారి వెండితెరపై తళుక్కుమంది కాజల్. అందులో అందాలతార ఐశ్వర్యారాయ్ చెల్లెలిగా కనిపించిన కాజల్ ను దర్శకుడు తేజ తన ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత కృష్ణవంశీ ‘చందమామ’లా కాజల్ ను తీర్చిదిద్దాడు. ఇక రాజమౌళి తన ‘మగధీర’లో మిత్రవిందగా కాజల్ ను మార్చేశాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కాజల్ తెలుగు చిత్రాలలో మెరుస్తూనే […]
తమిళనాడు లో కరోనాతో మరో సింహం మృతి చెందింది. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల మూడో తేదినా నీలా అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం మృతి చెందగా.. జూన్ 16 న పద్మనాధన్ అనే 12 ఏళ్ళ సింహం మృతి చెందింది. మొత్తం 11 సింహాలలో 9 సింహాలను కరోనా పాజిటివ్ సోకింది. వాటిలో నాలుగు సింహాలకు డెల్టా వేరియంట్ వైరస్ సోకినట్లు భూపాల్ […]
తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ది పై ఎంతో ఫోకస్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వరంగల్ లో ఐటీ పార్క్ ను అభివృద్ది చేసింది. ఈ వరంగల్ ఐటీ పార్క్ కారణంగా చాలా మందికి ఉపాది కలుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు వస్తున్నాయి. తాజాగా మరో కంపనీ 1350 మందికి ఉపాది కల్పించనుంది. ఏ-థీరమ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వరంగల్ ఐటి పార్క్‌లో తన కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధం అయింది. […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1417 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 610834 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1897 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 586362 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3546 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19029 యాక్టివ్ కేసులు […]
కెసిఆర్ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్ అయ్యారు. “తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాల్ని గమనిస్తే చాలు. రాష్ట్రంలో భూములమ్మి ఎలాగేనా వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతోంది. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ గారు… నేడు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సర్కారు భూమి అన్నదే లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అత్యంత కీలకమైన […]
రాజకీయాల్లో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్నటి వరకు మిత్రులైన వారు శత్రువులుగా మారొచ్చు. ఇన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉన్నవాళ్లు సడెన్‌గా దోస్తీ చేయొచ్చు. అధికార పార్టీకి చెందిన ఆ మంత్రి, ఎంపీలకు ఈ సూత్రం అతికినట్టు సరిపోతుంది. 2019లో కలిసి ఉన్నవారి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కోల్డ్‌వార్‌కు తెరతీశారు. ఇంతకీ ఎవరా నాయకులు? మంత్రి బాలినేని.. ఎంపీ మాగుంట మధ్య కోల్డ్‌వార్ ప్రకాశం జిల్లా వైసీపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య గరంగరం […]
టీఆర్‌ఎస్‌లోని ఆ సీనియర్ నేతకు మళ్లీ పదవీయోగం ఉందా? ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం దక్కించుకుంటారా? ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఫైర్ కావడం వెనక కారణం అదేనా? ఎమ్మెల్సీ పదవిపై అధిష్ఠానం హామీ దక్కిందా లేదా? కడియం శ్రీహరికి మరోసారి ఎమ్మెల్సీ ఇస్తారా? తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అయ్యాయి. షెడ్యులు ప్రకారం ఇదే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ […]
ఆ సినిమా స్టార్.. తర్వాతి కాలంలో పొలిటికల్ స్టార్ అయ్యారు. ఆ మధ్య కండువా మార్చి.. పాత గూటిలో సరికొత్తగా ప్రయాణం మొదలుపెట్టారు కూడా. ఇప్పుడు సోషల్ స్టార్‌గా న్యూ రోల్ పోషిస్తున్నారు. పార్టీలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారి.. ఫోకస్‌లోకి వస్తున్నారట. ఇంతకీ ఎవరా లీడర్? ఏమా కథ? బీజేపీలో గేర్ మార్చిన రాములమ్మ తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మ పాత్ర ప్రత్యేకం. సొంత పార్టీ పెట్టి.. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీ అయ్యారు. ఆపై కాంగ్రెస్‌లో […]
టిడిపి నేత నారా లోకేష్ పై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు. చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య తరువాత వచ్చిన జగన్ ప్రజలను శాంతంగా వుండాలని చెప్పారని….లోకేశ్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వయసు అయిపోతుంది…ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని..తిట్టాలనుకుంటే మేము తిట్టగలం…మాకు ఆ సంస్కృతి లేదన్నారు. మంచి సంస్కారంతో జగన్ ను.. రాజశేఖర్ రెడ్డి […]