వారిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ. కలిసి సాగాల్సిన చోట కత్తులు దూసుకుంటున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఎత్తులు వేస్తున్నారు. పోలీసుల ఎంట్రీ వారి మధ్య ఇంకా గ్యాప్ తెచ్చిందట. ఎవరా నాయకులు? ఏమా కథ? వేడెక్కిస్తున్న నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ రాజకీయం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నా.. సందర్భం వస్తే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇదే […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1492 కరోనా కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 609417 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1933 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 586362 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3534 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19521 యాక్టివ్ కేసులు […]
ఆ నాయకుడిపై సిక్కోలు టీడీపీ తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ఏదో జరుగుతుందని ఆశిస్తే.. ఇంకేదో అవుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ తమ్ముళ్లకు ఎవరిపై కోపం వచ్చింది? వారి బాధేంటి? ఎవరి వైఖరిని చర్చకు పెడుతున్నారు? అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడైనా సిక్కోలు టీడీపీలో నైరాశ్యం ఒకనాడు టీడీపీకి కంచుకోటైన సిక్కోలులో ప్రస్తుతం సైకిల్ పార్టీ క్యాడర్‌కు దారీతెన్నూ లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు ఓ వెలుగు వెలిగిన వారు.. కష్టకాలంలో కనిపించడం […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రామ్(సీఆర్ఎంపి) కింద ఏర్పాటు చేసిన రోడ్డుపై మ్యాన్హోల్ లేని ఉదంతంపై తక్షణమే భాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని […]
నేరెడుమేట్ లో హిజ్రాల హల్ చల్ సృష్టించారు. పెళ్లి వారి ఇంటికి వెళ్లి 50 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు…. ఇవ్వకపోతే బట్టలు విప్పి హంగామా చేస్తామని వారిని ఆందోళనకు గురి చేశారు. అంతేకాదు.. పెళ్లి వారిపై హిజ్రాలు దాడి చేశారు. దీంతో పోలీసులకు బాధితులు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన నేరేడు మెట్ పోలీసులు ఆ హిజ్రాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడి ఘటనతో ఆగకుండా ఆ హిజ్రాలు పోలీస్ […]
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికీ ఒక సంవత్సరం పైగా కావస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తయారీ రంగానికి వెన్నుముకగా నిలుస్తున్న సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా తాను పరిశ్రమల శాఖ మంత్రిగా గట్టి ప్రయత్నం చేస్తూ […]
ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన పార్టీకి, ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటలపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వీటికి ధీటుగా ఈటెల రాజేందర్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈటల రాజేందర్ మరోసారి సిఎం కెసిఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాచరికాన్ని బొంద పెట్టడం కోసం హుజురాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారని.. చైతన్య వంతమైన నియోజకవర్గ హుజురాబాద్ అని పేర్కొన్నారు. ఆరు సార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు, తెలంగాణ శాసన మండలి ద్వారా 2020 సంవత్సరంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో స్థాపించబడింది. 200 ఎకరాలలో విస్తరించిన విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ విశ్వ విద్యాలయం పారిశ్రామిక ప్రయోజనకరమైన ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. నిరంతరం సరికొత్త విధానాలను అన్వేషిస్తూ, వాటిని అనుసరిస్తూ, నిరంతరాయంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది. […]
టిడిపి, బిజేపిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. టీడీపీ-బీజేపీ నేతలు జత కలిశారా అనే అనుమానం వస్తుందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ. 399 కోట్లు ఉన్నాయని… ఈ సీజనుకు సంబంధించి రూ. 1200 కోట్లు ఇంకా కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు వాటిని రిలీజ్ చేయించేలా చర్యలు తీసుకుని క్రెడిట్ తీసుకోవచ్చని.. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలను మేము అనుసరిస్తున్నామని […]