అడల్ట్ కంటెట్ తో వస్తున్న హిందీ వెబ్ సీరిస్ కు యువత నుండి ఆదరణ లభిస్తోందనే వార్తలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. దాంతో ఆ తరహా వెబ్ సీరిస్ లను తెలుగులోనూ తీస్తే బాగుంటుందనే భావన మన వాళ్ళకూ కలిగినట్టుంది. ఇంతవరకూ లవ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, పొలిటికల్ థ్రిల్లర్స్ కు పరిమితమైన తెలుగు దర్శక నిర్మాతలు… ఓ అడుగు ముందుకేసి ఆడల్ట్ కంటెంట్ వైపు దృష్టి సారించారు. అలా తీసిన వెబ్ సీరిసే ‘ఇన్ ది […]
ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భూముల అమ్మకం ఏంటీ.. కేసీఆర్..? ఆదాయం కోసం నిన్న సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టారని మండిపడ్డారు. ఎకానమీ పెంపుపై నిపుణులతో సమావేశం పెట్టాలని..బసవన్నలతో కాదని నిప్పులు చెరిగారు. టీఆరెస్ సర్కార్ తప్పుడు పనులు చేస్తుందని..ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ఆర్టికల్ 20 ప్రకారం గవర్నమెంట్ ట్రస్టీగానే పనిచేయాలని.. నన్ను తిట్టిన, చంపిన ప్రజల పక్షాన […]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత మెరుగుపరిచేందుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కమిటీ బిఆర్‌కె భవన్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆస్పత్రికి సకాలంలో రాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్నీ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో వైద్య సేవల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని కూడా సూచించింది. […]
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక ప్రక్రియపై పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడుతున్నారు నేతలు. పదవి కోసం పోటీ పడటం సహజమే. అయితే, నాకు పదవి వచ్చినా రాకపోయినా… పక్కోడికి మాత్రం రావొద్దు అనే తరహా ఫిర్యాదులు చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కీలక భేటీ నిర్వహించనుంది కాంగ్రెస్ అధిష్టానం. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరుగనుంది. […]
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బిజెపి టిప్పు సుల్లాన్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని.. ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో మత సామారస్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. నేను బిజెపీకి వివరణ ఇవ్వడం లేదని.. ప్రొద్దుటూరులోని క్రైస్తవులకు, హిందువులకు వివరణ ఇస్తున్నానని స్పష్టం చేశారు. శ్రీరంగ పట్నాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన రాజు టిప్పు సుల్తాన్ అని.. మైసూరును ఆక్రమించుకునేందుకు బ్రిటీష్ వారు వస్తే వ్యతిరేకంగా పోరాటం చేసిన భారతీయుడు టిప్పు […]
జనసేన అధినేత,సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను బిజెపి రాజ్యసభకు పంపిస్తుందని కొన్ని రోజులుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆయనను కేంద్ర క్యాబినెట్‌లోకి కూడా తీసుకుంటారని తర్వాత ఈ కథలు విస్తరించాయి.సోషల్‌మీడియాలో మొదలైన ఈ కథలు నెమ్మదిగా ఉధృత ప్రచారంగా మారాయి.ఇంతకూ వీటిలో వాస్తవమెంత?జనసేన నాయకులు వీటి గురించి ఏమంటున్నారు?మొదటి విషయం ఇవి పూర్తిగా నిరాధారమైనవని జనసేన ముఖ్యనాయకులు కొట్టిపారేస్తున్నారు.బిజెపి నుంచి అలాటి ప్రతిపాదన ఏదీ రాలేదని వచ్చినా పవన్ ఒప్పుకోరని చెబుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు వున్నప్పుడే అలాటి ఆఫర్లు […]
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణిక్యం ఠాగూర్ కొనసాగుతారా.. కొత్త వ్యక్తి వస్తారా? అయితే బాధ్యతలు చేపట్టే ఆ మూడో కృష్ణుడు ఎవరు? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో.. గాంధీభవన్ సర్కిళ్లలో ఇదే చర్చ జోరుగా ఉంది. ఇంతకీ ఠాగూర్ ఎందుకు వెళ్లిపోతారు? ఆయన ఫోకస్ దేనిపై ఉంది? తమిళనాడు పీసీసీ పీఠంపై ఠాగూర్ కన్ను తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియలో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. మరో పదవిపై […]
తెలంగాణ రాష్ట్రంలో దొంగల ప్రభుత్వం నడుస్తోందని..కిసాన్ మోర్చా ఇన్చార్జ్ ప్రేమేంధర్ రెడ్డి అన్నారు. ఏడేళ్ళలో ఎన్నికోట్ల నకిలీ విత్తనాలు అమ్మారు.. రైతులు ఎంతమేర నష్టపోయారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఎన్ని పీడీ యాక్ట్ పెట్టారు.. రైతుబందు పేరుతో రైతులకు వచ్చే అనేక సబ్సిడీలను తెలంగాణ సర్కార్ కోత పెట్టిందన్నారు. డీఏపీ కేంద్ర ప్రభుత్వం సగం ధరకే ఇస్తుందనన్నారు. ఎరువులు ఉచితంగా ఇస్తా అన్న కేసీఆర్.. మాట నిలబెట్టుకుంటరా? లేదా..? రైతులకు అరచేతిలో […]