మన దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ 50 వేల మార్క్‌ను దాటాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 50,040 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,33,183 కి చేరింది. read more : రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత.. ఓ మహిళ […]
దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి కోవింద్ ఉత్తరప్రదేశ్ పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్ ట్రాఫిక్ ను నిలిపివేసారు పోలీసులు. అయితే.. ఆ ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ మహిళ మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళను… ఆమె భర్త కారులో తీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే […]
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై కొత్త రోజులుగా పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలో లేకున్నప్పటికీ…పీసీసీ పదవిపై చాలా మంది ఆశ పడ్డారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పీసీసీ కోసం ఎగబడ్డారు. ఎవరికి వారు… తమ పంతాన్ని నెగ్గించుకునే పనిలో పడ్డారు. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ పై కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు నిన్న ఏఐసీసీ కీలక ప్రకటన […]
కడప జిల్లా : ఎట్టకేలకు బ్రహ్మంగారి పీఠాధిపతి వివాదం ముగిసింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి నియామకం అయ్యారు. దీంతో బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులంతా రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చారు. పీఠం చిక్కుముడి వీడటంతో బ్రహ్మంగారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. read also : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. తెలంగాణలో మూడు రోజుల పాటు! పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా […]
హైదరాబాద్ లో ఇవాళ వేకువజాము నుంచి వర్షం పడుతోంది. సరిగ్గా ఉదయం 3 గంటలకు ప్రారంభమైన ఈ వర్షం… ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, దిల్ సుఖ్‌నగర్, కోటి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, కొండాపూర్, నారాయణగూడ, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారు జాము నుంచి వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. read also : బీజేపీ దూకుడు…త్వరలో […]
ఈటల రాజేందర్ రాకతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ… మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 30 న బీజేపీ రాష్ట్ర వర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర కార్యవర్గం. ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక, బండి సంజయ్ జిల్లాల పర్యటనతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చ జరుగనుంది. జూలై 1 నుంచి 8 వరకు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేయనున్నారు. […]
తెలంగాణ రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న…‘‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి ఇవాళ ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్ లో ప్రారంభం కానున్న అఖిల పక్ష సమావేశం సుధీర్ఘంగా సాగనున్నది. read also : […]
గత ఐదు రోజులుగా తగ్గుతు వస్తున్న బంగారం ధరలు ఈరోజు తిరిగి భారీగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,100 కి చేరింది. 10 […]
అమరావతి : దేవాలయాల్లో అక్రమాల కట్టడికి దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇకపై దేవాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని వివిధ స్థాయిల్లోని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత కొంత కాలంగా రెగ్యులర్ చెకింగ్‌లు లేకపోవడంతో దేవాలయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డ దేవదాయ శాఖ కమిషనర్ అర్జున రావు…. కొందరు ఈవోలు ఉన్నతాధికారులిచ్చే ఆదేశాలు పాటించడం లేదని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. read more :హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ ఆకస్మిక తనిఖీల్లో క్యాష్ […]
హెచ్ సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది అపెక్స్ కౌన్సిల్. అజారుద్దీన్ ను ఇటీవలే… హెచ్ సిఏ సభ్యత్వం రద్దు చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్. ప్రస్తుతం హెచ్ సిఏ వైస్ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ఉన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్ […]