ఆ జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధుల ఆరాటం ఒక్కటే. ఎమ్మెల్సీ మాకు కావాలంటే మాకు కావాలని ట్రై చేస్తున్నారు. గతంలో చేసిన త్యాగాలు.. ప్రస్తుతం తమ పొజిషన్.. ఫ్యూచర్‌లో ఎదురయ్యే సమస్యలు ఏకరవు పెడుతూ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట. జిల్లా కేంద్రం నుంచి విజయవాడకు ఎక్కని వాహనం.. దిగని వాహనం లేదన్నట్టు క్యూ కడుతున్నారట. ఎవరా నాయకులు? పార్టీ పెద్దలు వారికిచ్చిన హామీలేంటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం కర్చీఫ్ అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని ఎమ్మెల్సీ పదవి […]
తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తిస్థాయిలో పాలకమండలి ఏర్పాటవుతుందని భావిస్తుంటే స్పెసిఫైడ్ అథారిటీ వచ్చింది. టీటీడీలో పదవి కోసం పైరవీలు సాగించిన వారికి ఆ నిర్ణయం నిరాశపర్చింది. కొత్త బోర్డు ఏర్పాటుకు మరింత సమయం పడుతుందన్న సంకేతాలను పంపింది ప్రభుత్వం. ఇంతకీ సర్కార్ ఎందుకీ నిర్ణయం తీసుకుంది? ఇప్పట్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు లేనట్టేనా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేశారు సీఎం జగన్. సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు. ఆ […]
గ్రేటర్ హైద్రాబాద్ లో నేటి నుంచి దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే PV మార్గ్ అంబేద్కర్ నగర్ లో GHMC నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు KTR , తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పీవీ మార్గ్ లో ఈ ఇళ్ళకు కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటుందని.. పేదల కోసం ప్రభుత్వం ఇల్లు కట్టిచ్చిందని పేర్కొన్నారు. […]
ఏపీ ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో రాజీ పడేదే లేదని.. ఎన్జీటీ తీర్పులను ఏపీ గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. వెంటనే కేంద్రం ఇరు రాష్ట్రాల వాటా తేల్చాలని.. తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని.. కేంద్రానికి అబద్ధాలు చెప్తూ అక్రమంగా ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని ఫైర్ అయ్యారు. read also :తెలంగాణ […]
తొందరపడి ఓ కోయిల ముందే కూసిందా? అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటా? పీసీసీ సారథి నియామకం విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? పీసీసీ చీఫ్ ఎంపిక జాప్యానికి ఆ ఇద్దరు నాయకుల భేటీనే కారణమా? ఇంతకీ ఎవరా నాయకులు? ఇద్దరు నాయకుల భేటీనే కొంప ముంచిందా? తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ ఎంపిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదిగో.. అదిగో అంటూ చెప్పుకోవడమే తప్ప.. అయ్యింది లేదు… పోయింది లేదు. ఇక నోట్ రెడీ అవ్వడమే […]
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ వ్యూహం ఏంటి? ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకుందా? గత ఉపఎన్నికలకు భిన్నంగా పార్టీలో సీనియర్లను రంగంలోకి దించుతున్నారా? ఆసక్తి రేకిత్తిస్తోన్న గులాబీ శిబిరం ఎత్తుగడలను ఈ స్టోరీలో చూద్దాం. హుజురాబాద్‌పై పూర్తిస్థాయి పట్టుకోసం దృష్టి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్ట్రాటజీ పక్కాగా ఉంటుంది. ఉపఎన్నికల్లో అంతకు మించిన వ్యూహాలు అధికార పార్టీ సొంతం. ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌లోనూ అలాంటి వ్యూహాలకే పదునుపెడుతోంది గులాబీ పార్టీ. ఉపఎన్నిక […]
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్నటి రోజున 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా, ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 48,698 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,83,143 కి చేరింది. read more : కత్తి మహేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం! […]
సినీ నటుడు కత్తి మహేష్‌కు పెను ప్రమాదమే తప్పింది. కత్తి మహేష్ ప్రయాణిస్తోన్న కారు ముందుగా వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని కత్తి మహేష్ ఇనోవా కారు ఢీకొట్టింది. read also :మరోసారి పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు […]
కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 36 పైసలు, లీటర్ డీజిల్ పై 38 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.11 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.65 కు చేరింది. read more […]