మన దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ 50 వేల మార్క్‌ను దాటాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 50,040 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,33,183 కి చేరింది.
read more : రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత.. ఓ మహిళ మృతి
ఇందులో 2,92,51,029 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 5,86,403 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1,258 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,95,751 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 57,944 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ 96.75% గా ఉన్నట్లు పేర్కొంది కేంద్రం.