గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం, సాధారణ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం 10 .30 గంటలకు వర్చ్యువల్ గా జరుగుతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. కోవిడ్ నియమ, నిబంధనల నేపథ్యంలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశం వర్చ్యువల్ గా నిర్వహించేందుకు సభ్యులందరికి ఐ.డి లను పంపించారు. రేపు జరిగే ఈ సమావేశంలో మొదటగా నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ప్రసంగిస్తారు. నగరంలో జరగుతున్న అభివృద్ధిని వివరిస్తూ మేయర్ ప్రసంగించనున్నారు. అనంతరం.. 2021 […]
తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి, వారి జీవితాల్లో గుణాత్మకమార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నదని, తమ లక్ష్యసాధనలో దళిత మేధావి వర్గం కదలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 1200 కోట్ల రూపాయలతో ప్రారంభించి, రానున్న కాలంలో 40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సిఎం దళిత సాధికారత పథకం’ కోసం పటిష్టమైన కార్యాచరణ ను రూపొందిస్తున్నామని, అందుకు తగు సూచనలు సలహాలు అందించాలని, తనను కలిసి ధన్యవాదాలు తెలిపిన […]
తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి మండిపడ్డారు. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంపై సక్రమమేనని…తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు…రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని… దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని […]
కాంగ్రెస్ పార్టీ గరక లాంటిది.. ఎండకు ఎండినా… చిన్న చినుకు పడితే పచ్చగా చిగురిస్తుందని కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కొత్త పిసిసి టీం సభ్యుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చరిత్రలో నాలుగు నెలలకు పైగా అభిప్రాయ సేకరణ చేసి పిసిసి నియామకం చేయడం ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు. నేను సోనియా గాంధీ మనిషి అని… చిన్న వయసులో.. తక్కువ సమయంలో నాకు పెద్ద […]
గతంతో పోలిస్తే… తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,21, 606 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,869 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 9 మంది మృతి చెందారు. read also […]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం మళ్లీ రాజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నీటి వివాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ… తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ”వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే… సీఎం జగన్ గజ దొంగ” అన్న సందర్భాలు ఉన్నాయి. అటు ఏపీ మంత్రులు కూడా అదే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వపై […]
ఏపీ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పాదనను అడ్డుకునేలా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం దారుణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం హైడెల్ పవర్ ప్రాజెక్టేనని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం హైడెల్ పవర్ పై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారిందని… కృష్ణా బోర్డు అనేక అంశాల్లో చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ట్రిబ్యునల్ […]
ఏపీకి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధోల్పూర్, అలీఘడ్, మీరట్, అంబాలా మరియు అమృతసర్ గుండా వెళుతుం దని పేర్కొన్న వాతావరణ శాఖ.. దక్షిణ ఒడిశా & పరిసరాలపై ఇతర ఉపరితల ఆవర్తనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ & తీరప్రాంత పరిసరాల మరియు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి గాలులు […]
తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి టీడీపీని నట్టేటా ముంచేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మునగడం ఖాయమని.. అందులో అసలు అనుమానమే లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే.. అదే మాట్లాడతారని మండిపడ్డ ఆయన..రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంతోనే కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని వెల్లడించారు. read also : మరోలేఖ విడుదల చేసిన మావోయిస్టులు.. దళితజాతి వ్యతిరేక పార్టీ […]
మాజీ మంత్రి, బీజేపీ నేత ఏ.చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే కేసీఆర్ ను దళితులు విశ్వసిస్తారన్న ఎ.చంద్రశేఖర్… రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడేళ్ళ తర్వాత సీఎం కేసీఆర్ కు దళితులు గుర్తురావటం సంతోషకరమని… దళితులు అండగా ఉండబట్టే ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్ళగలిగారని తెలిపారు. ఉద్యమంలో దళితులు తిండికి లేక ఇబ్బంది పడితే.. కేసీఆర్ ఒక్క రోజు కూడా ఉపవాసం […]