పీసీసీకి కొత్త నాయకత్వం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాయి శ్రేణులు. కానీ.. ఆ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇంఛార్జ్ పదవిపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదు. కిందస్థాయి ప్రజాప్రతినిధులు చేజారిపోతున్నా పట్టించుకోవడం లేదట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూపులదే రాజ్యం! అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువయ్యాయి. ఏ ఎన్నిక జరిగిన తమ వారికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానం మీద […]
ఆయనో సీనియర్ నేత. కొంతకాలం రాజకీయ జీవితానికి గ్రహణం పట్టినా.. మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఢిల్లీలో పెద్దలసభకు పంపింది అధికారపార్టీ. అదేంటో…! చేతిలో పెద్దపదవి ఉన్నా.. పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరట. దాంతో ఆయనకేమైంది అని చర్చించుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇంతకీ ఎవరా నాయకుడు? రాజ్యసభ సభ్యుడు అయ్యాక మార్పు వచ్చిందా? KR సురేష్‌రెడ్డి. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి ఎమ్మెల్యే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగు రాష్ట్రాల ప్రజలకు […]
మాజీ మంత్రి ఈటలపై తొలిసారిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటెల రాజేందర్ కు టీఆరెస్ ఎంత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని.. ఈటెలకు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని నిలదీశారు. మంత్రిగా ఉండి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టారని…ఈటెల రాజేందర్ తప్పు చేయకుండానే ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చిందని…టీఆరెస్ అభివృద్ధిని.. బీజేపీ ఖాతాలో ఈటెల ఎలా వేసుకుంటారు? అని ఫైర్ అయ్యారు. read also […]
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పీడ్ పెంచారా? మోడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తున్నారా? రాహుల్, ప్రియాంకతో భేటీకి కారణం అదేనా? పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్ జరిగిందని అంతా చెబుతున్నా… కారణం మాత్రం అదేనన్న చర్చ నడుస్తోంది. పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకతో భేటీ అయ్యారు. అయితే పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో సిద్దూ, అమరీందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఎన్నికలకు […]
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతూనే ఉంది. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సృష్టిస్తున్న అడ్డంకులు, అవరోధాలు, అక్రమాలపై సుప్రీంకోర్టులో తాజాగా ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. “కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు” పరిధిని వెంటనే నోటిఫై చేయాలని… తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఈ పిటిషన్ లో పేర్కొంది ఏపీ సర్కార్. read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్ […]
కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి, సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహను నియమించగా… నియోజక ఎన్నికల సమన్వయకర్తలుగా.. ఎమ్మెల్స్ […]
తెలంగాణ కేబినెట్ ఇవాళ మళ్లీ భేటీకానుంది. నిన్న జరిగిన భేటీలో కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా, జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై ఇవాళ చర్చించనుంది కేబినెట్. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులను ఆదేశించిన కేబినెట్.. ఖాళీల భర్తీకి వార్షిక క్యాలెండర్ తయారు చేయాలని నిర్ణయించింది. గురుకులాల్లో స్థానిక నియోజకవర్గ విద్యార్థులకే 50శాతం సీట్లు కేటాయించ నున్నారు. read also : ఇవాళ అమిత్‌షాతో బండి […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును వివరించనున్నారు. read also : వాహనదారులకు ఊరట… ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే ? అయితే… […]
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు కాస్త ఊరట కలిగించాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా నమోదయ్యాయి. తాజా ధరల ప్రకారం… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద కొనసాగుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.72 కు చేరింది. […]