ఇండియాలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. దేశంలో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప టి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.21 కోట్లకు చేరింది. ఇందులో 3,13,38,088 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,87,673 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 478 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం […]
హుజురాబాద్ ఎన్నికలకు సిద్దమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. పార్టీ అభ్యర్ధి ఎంపిక కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోవడం లేదు.. కానీ, పోటీలో కూడా లేకుండా పోతే ఎలా అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్ధి ఎంపిక చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది. బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఎవరికి ఉంటుందనే లెక్కలు వేస్తోంది. దీంట్లో భాగం… మాజీ మంత్రి కొండా సురేఖ పేరు పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అందుకు కొండా సురేఖ […]
అమరావతి : నేడు విజయవాడ కు రానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విమానంలో విజయవాడ కు చేరుకోనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే… పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు జనసేనాని. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ […]
ఇంగ్లండ్‌లో సామూహిక కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లైమౌత్‌లో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఐదేండ్ల చిన్నారి ఉన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించాడని కార్న్‌వాల్ పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని ఘటనా స్థలంలో ఉన్న ఓ మహిళ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇది ఎలాంటి ఉగ్రవాద చర్యా కాదని స్పష్టం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 5.76 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కేంద్రం కేటాయించింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వీటిని వైద్య అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీటిని సరఫరా చేయనున్నారు. ఏపీకి అదనపు వ్యాక్సిన్ డోసులు అందడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. కాగా…రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,030 శాంపిల్స్ పరీక్షించగా.. […]
హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈనెల 16న నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పాలన పరమైన అంశాల్లో కేసీఆర్ వేగం పెంచారు. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ సిద్దిపేట, మెదక్, వరంగల్ జిల్లాలను సందర్శించారు. వాస్తవానికి ఈనెల మొదటి వారంలో నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటనకు వెళ్లాల్సింది ఉంది. […]
ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే… గత రెండు రోజులుగా భారీగా పెరుగుతోంది. తాజాగా… పుత్తడి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ధరలు తగ్గు ముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి […]
మేషం : ముఖ్యుల ఆరోగ్యం మిమ్మలను నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తులు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వృషభం : సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి వంటివి అధికం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం […]
ఉద్యోగాల భర్తీ వైపు జగన్ సర్కార్ ఒక్కో అడుగూ వేస్తోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా భారీగా ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం.. తాజాగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గత నెలలోనే ఏపీపీఎస్సీ నుంచి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటాలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. కానీ, ఈ విషయంలో చిన్నపాటి సాంకేతిక అడ్డంకిని ఏపీపీఎస్సీ గుర్తించింది. Read: పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ […]