ఇండియాలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. దేశంలో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప టి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.21 కోట్లకు చేరింది. ఇందులో 3,13,38,088 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,87,673 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 478 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4.30 లక్షలకు చేరింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తప్పని సరిగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేకుండా బయటకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.