ఆగస్టు 14, శనివారం దిన ఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ముఖ్యుల ఆరోగ్యం మిమ్మలను నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తులు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
వృషభం : సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి వంటివి అధికం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులు తోటివారితో విందులు వినోదాల్లో పాల్గొంటారు.
Also Read
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
మిథునం : పత్రిక, ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కొత్త ప్రదేశంలో ఆహారం, నీరు, మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
కర్కాటకం : బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలు వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది.
సింహం : రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఎదుటివారిని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. స్వర్ణకారులు, వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ మంచి కోరుకునే వారు కంటే మీ చెడును కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
కన్య : రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అసవరం. పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాల వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
తుల : ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
వృశ్చికం : రావలసిన పత్రాలు, రశీదులు చేతికందుతాయి. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంలో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగుపడుతుంది. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది.
ధనస్సు : ప్రైవేటు సంస్థలలో వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది.
మకరం : బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. రుణ, విదేశీయాన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
కుంభం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవడం మంచిది.
మీనం : మీ సంతానం ఉన్నత విద్యల గురించి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం వుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుంటారు. అనుకోని ఖర్చులు తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!