ఆగస్టు 19 నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించబోయే.. జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం కానుంది. కోదాడ నుండి హైదరాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ లో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్ లో భద్రకాళి దర్శనం, వరంగల్, హనుమకొండ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఖిల్లాషాపూర్ […]
గతంలో కేంద్రమంత్రిగా పనిచేసి.. ఓ వెలుగు వెలిగిన ఆయన కొన్నాళ్లూగా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఏమైందో ఏమో.. సడెన్‌గా చర్చల్లోకి వచ్చారు. ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించి ఆశ్చర్యపరిచారు. దీంతో ఆయన దారెటు? కొత్త కామెంట్స్.. కొత్త ప్రయాణానికి సూచికా లేక.. పాత శిబిరంలో సర్దుకుపోతారా అని అనుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? దళితబంధుపై సర్వే ప్రశంసల జల్లు!సర్వే కామెంట్స్‌తో సంబంధం లేదన్న కాంగ్రెస్! సర్వే సత్యనారాయణ. కేంద్ర మాజీ మంత్రి. ఇటీవల బీజేపీ నాయకులు ఆయనతో […]
తెలంగాణ కాంగ్రెస్‌లో వార్ కంటిన్యూ అవుతూ ఉంది. దళిత గిరిజన దండోరా సభ వేదికపై పార్టీలోనే రచ్చ జరుగుతోంది. ఇంద్రవెల్లి సభ జోష్ లో.. ఇబ్రహీంపట్నంలో దళిత గిరిజన దండోరా సభను ప్రకటించారు పిసిసి చీఫ్ రేవంత్. అక్కడే హస్తంపార్టీలో పంచాయతీ మొదలైంది. ఇబ్రహీంపట్నం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. పిసిసి చీఫ్ ఎవరిని అడిగి ఈ సభను ప్రకటించారని కోమటిరెడ్డి… అటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుర్రుగా ఉన్నారు. స్థానిక ఎంపి సభకు రాకుంటే సభతో […]
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. డెల్టా వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. థర్డ్‌వేవ్ ముంచుకొస్తుందన్న వార్తలు వస్తున్న క్రమంలో… డెల్టా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ దేశాల్లో కేసులు పెరుగుదలకు డెల్టానే కారణమని WHO పదే పదే చెప్తోంది. ప్రపంచంలో 142 దేశాలు డెల్టా కోరల్లో చిక్కుకున్నాయని ప్రకటించింది. అంతేకాదు భారత్ డేంజర్ లిస్ట్‌లో ఉన్నట్టు తెలిపింది. గామా, బీటాతో పోలిస్తే డెల్టా వెయ్యి రెట్లు అధిక ప్రభావం చూపిస్తోందని హెచ్చరించింది. వారం […]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం రఘునాధ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మొదటిసారిగా రఘునాధ్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇతను సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ రాష్ట్రకార్యదర్శి శివశంకర్‌రెడ్డిని 7 గంటల పాటు సీబీఐ విచారించింది. గతంలో కూడా శివశంకర్‌రెడ్డిని సిట్, సీబీఐ బృందాలు ప్రశ్నించాయి. ఈ కేసులో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. మరోవైపు డాక్టర్ భరత్ రెడ్డిని కూడ సీబీఐ అధికారులు […]