అమెరికాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా : గంటకు 42 మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొవిడ్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన అమెరికా… వైరస్ విజృంభణతో మరోసారి విలవిల్లాడుతోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న వైరస్ బాధితుల సంఖ్య మళ్లీ ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత రెండు వారాల్లోనే ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల సంఖ్య ఏకంగా 70 శాతానికి పైగా పెరిగింది. మరణాలు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో చనిపోయిన అమెరికన్ల సంఖ్య వెయ్యి దాటింది. గంటకు 42 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు తేల్చారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగడంతో అమెరికాలో కొవిడ్ కాస్త అదుపులోకి వచ్చినట్లే కనిపించినా… డెల్టా తరహా కొత్త వేరియంట్ల వల్ల కేసుల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్ తీవ్రత తగ్గాక చాలా ప్రాంతాల్లో మాస్కులు ధరించడంపై ప్రభుత్వం ఆంక్షలు సడలించింది.
Read: మధ్యప్రదేశ్‌కు జ్యోతిరాదిత్య అదిరిపోయే గిఫ్ట్…
Also Read
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో… పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. స్పాట్… నెల రోజులుగా అమెరికాలో కరోనా కేసులు, మరణాలు అనూహ్యంగా పెరిగాయి. రోజూ సగటున 769 మంది కరోనాకు బలవ్వగా… తాజాగా ఒక్కరోజులో ఒక వెయ్యి 17 మంది వైరస్ కారణంగా ప్రాణాలు వదిలారు. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6 లక్షల 22 వేలు దాటింది. వైరస్ తీవ్రత పెరగడంతో మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ హెచ్చరించింది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోనివాళ్లంతా ప్రమాదపుటంచున ఉన్నట్లేనని పేర్కొంది.
తాజావార్తలు
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!