బెజవాడలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి కేసులో ట్విస్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెజవాడ అరండల్‌పేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. రాఖీ పండగనాడు తమ్ముడికి రాఖీ కట్టి వెళ్లిన ఆమె ఆ తర్వాత రెండు గంటలకే చనిపోయినట్టు కబురందింది. అయితే అత్తింటివారే ఆమెను చంపేశారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు ఉష, ఫణి. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే..! ఉష ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తర్వాత అన్నీ సర్దుకున్నాయ్ అన్న సమయంలో అత్తింటి వేధింపులు మొదలయ్యాయన్నది ఆమె తల్లిదండ్రుల ఆరోపణ. తనకన్నా ఎక్కువ సంపాదిస్తున్న భార్యపై భర్త ఫణి కక్ష పెంచుకున్నాడని… అత్తమామలు కూడా తరచూ వేధించేవారని అంటున్నారు. మరోవైపు తనకు రాఖీ కట్టేందుకు వచ్చి వెళ్లిన అక్కను టార్చర్ పెట్టి చంపేసి ఉంటారని తమ్ముడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మరోవైపు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న బెజవాడ పోలీసులు… దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్త ఫణితో పాటు అత్తమామల్ని ప్రశ్నిస్తున్నారు. రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇటీవలే సింధు, ఇప్పుడు ఉష… ఇలా బెజవాడలో వరుస ఘటనలు అలజడి రేపుతున్నాయి.
Also Read
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!