టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కాసేపటి క్రితమే ఈ ప్రకటన చేశారు హర్భజన్ సింగ్. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. […]
తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అంటారు. కానీ ఇప్పుడు గారెల బదులు బిర్యానీ అనాలేమో. ఎందుకంటే అందరు మెచ్చిన వంటకంగా బిర్యానీ మారిపోయింది. అందునా మన హైదరాబాద్ బిర్యానీకి మరీ క్రేజ్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు..టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. మహేశ్ నుంచి సల్మాన్ దాకా ..యాక్టర్లు క్రికెటర్లు అందరికి ఇష్టమైన వంటకం హైద్రాబాదీ బిర్యానీ. ఆర్డర్లలోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. నిమిషానికి 115 ఆర్డర్లలో టాప్ లో నిలిచింది. అందుకే ఫుడ్ […]
మూడేళ్లలో 1.50 లక్షల కోట్లను సంక్షేమం కోసం జగన్ సర్కార్ వెచ్చించిందని… చంద్రబాబు హయాంలో క్రైస్తవులపై దాడులు జరిగాయని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గుంటూరు జిల్లాలో దళితులపై దాడి జరగలేదని…కులాలు వర్గాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ వల్ల ప్రజలకు అనేక లాభాలు ఉన్నాయని… ఓటీఎస్ పై తెదేపా దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు మాటల్ని ప్రజలు ఎవరూ విశ్వ సించడం లేదని.. తన హయాంలో ఇళ్ల రుణాలను ఎందుకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,670 శాంపిల్స్ పరీక్షించగా.. 103 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 175 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,67,410 […]
ఆ జిల్లాలోని ముఖ్య నేతలంతా కేరాఫ్ హైదరాబాద్. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేదు. అందరు నాయకులదీ అదే తీరు. ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన నేతలు.. స్థానిక ప్రజలకు దూరంగా ఉంటున్నారట. దీంతో ప్రజలకు.. వాళ్లు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ వస్తుందని టాక్. ఇంతకీ ఏంటా జిల్లా? నాయకులు ఎందుకు జిల్లాలో ఉండటం లేదు? రెండేళ్లుగా ప్రజలకు దూరంగా ప్రజాప్రతినిధులు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లా. రాజకీయ చైతన్యం ఎక్కువే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి కాకలు తీరిన […]
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఆ ఎమ్మెల్యేలకు పట్టు సడలిందా? ఎమ్మెల్యేల మాటలను వినే పరిస్థితి లేదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా.. ఆ నియోజకవర్గాల్లోని డొల్లతనం బయటపడిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? ఎమ్మెల్యేలకు లోకల్ లీడర్లపై పట్టు సడలిందా? ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు టీఆర్ఎస్ వర్గాల్లో కొనసాగుతున్నాయి. ఎవరికి వారుగా పోస్టుమార్టం చేస్తున్నారు. అందరి ఫోకస్ కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలపై ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల […]
పీయుష్ గోయల్ వ్యాఖ్యలు రైతులను గందరగోళంలోకి నెట్టాయని… యాసంగి వడ్లు కొంటామని లిఖితపూర్వకంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడారా? అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చేందుకు క్లియరెన్స్ అయిందని పేర్కొన్నారు. నలుగురు బిజెపి ఎంపిలు ఏం చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా ఇప్పించారా? అని నిలదీశారు. కేసీఆర్ […]
మంత్రి అంటే అభిమానులు.. అనుచరులు కామన్. కొందరు మంత్రి చెప్పిన పనిచేస్తే.. ఇంకొందరు తమ అభిమాన నేతపై ఈగ వాలితే సహించలేరు. ప్రస్తుతం ఆ మినిస్టర్ విషయంలో అదే జరుగుతోందట. అభిమానం తలనొప్పులు తెచ్చిపెడుతోందని టాక్. తాజా ఎపిసోడ్‌లో విపక్షాలకు టార్గెట్‌గా మారి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆ అమాత్యులవారు. సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనతో రచ్చ రచ్చ..! బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. ఏపీ మంత్రి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన చుట్టూనే విమర్శలు.. ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. గతంలోనూ ఆయన […]
అక్కడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు టైమ్ చూసి ఝలక్ ఇస్తున్నారట పార్టీ నేతలు. నిరసనలు చేపడితే ఒక్కరు కనిపించడం లేదు. ముందురోజు వస్తామని చెప్పినవాళ్లే తర్వాతిరోజు పత్తా లేకుండా పోతున్నారట. ప్రస్తుతం ఆ జిల్లాలో ఆ ఎమ్మెల్యే.. అక్కడి కార్యకర్తల తీరుపైనే గులాబీ శిబిరంలో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. పార్టీ శ్రేణుల తీరు ఎమ్మెల్యేకు అంతుచిక్కడం లేదా? బిగాల గణేష్ గుప్త. నిజమాబాద్ అర్బన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. పార్టీకి బలం.. బలగం భారీగానే ఉన్న ఈ నియోజకవర్గంలో […]