అవకాశం ఉన్న ఏ చోటునూ వదలకుండా విస్తరించుకుంటూ పోయేందుకు సీపీఐ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ లోనూ తమ వాణి వినిపించేందుకు.. అక్కడ సైతం జనాల్లో ఎంతో కొంత పట్టును పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే అమరావతి పోరాటంలో సీపీఐ నేతలు కాస్త క్రియాశీలకంగా ముందుకు పోతున్నారు. ఇతర సమస్యలపైనా.. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. తాజాగా.. ఆ పార్టీ జాతీయ నాయకత్వం సైతం ఆంధ్రాపైనే దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ పెంచే దిశగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. […]
వినాయక చవితి పండగ దగ్గరికొస్తోంది. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి. వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని.. కోవిడ్ కారణంగా ఎక్కువగా జనాలు గుమికూడవద్దని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. ఈ ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇదే.. బీజేపీ, టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఇతర కార్యక్రమాలకు అడ్డు రాని కరోనా.. ఇప్పుడు వినాయక చవితి పండగకే అడ్డు పడుతోందా.. అన్న చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ […]
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల […]
స్వదేశంలో కన్నా విదేశాల్లో విజయం చాలా స్వీట్. ఎప్పుడోగానీ అలాంటి విక్టరీలు దక్కవు. ఓవల్ టెస్ట్ విన్ కూడా అలాంటిదే. స్వీట్ స్వీట్ విక్టరీ. ఇంగ్లండ్‌పై వరసగా రెండో టెస్టులో విజయం సాధించి క్రికెట్ ఫ్యాన్స్‌ను పండగ చేసుకోమంది కోహ్లీసేన. నిజమే..అభిమానులకు.. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విజయంఇది. ఈ గెలుపుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ను వరసగా రెండు టెస్టుల్లో ఓడించటం చరిత్రలో రెండు సార్లే జరిగింది. మొదటిసారి 1986లో .. కపిల్ […]
సిరిసిల్లా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉదృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు వచ్చిన విషయం తెల్సుకున్న మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో […]
పుత్సవాత్సల్యం ఎంత పనినైనా చేయిస్తుంది. ఆ ప్రేమలో ఉన్నవారు ఆఖరికి చావడానికైనా.. చంపడానికి సిద్ధమవుతుంటారు. ఇప్పుడు ఏపీ టీడీపీలోనూ అదే సీన్ కన్పిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన పుత్రుడు లోకేష్ ను ఎలాగైనా రాజకీయంగా యాక్టివ్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడింది. ఆయనకు వయోభారం మీద పడుతుండడంతో ఇప్పుడు లోకేష్ ఎదగడం చంద్రబాబు నాయుడుకు అత్యవసరం. ఈ కారణంగానే ప్రస్తుతం టీడీపీని […]
ప్రశ్నించేందుకే జనాల్లోకి వచ్చిన పార్టీ జనసేన అని ఆ పార్టీ అధినత పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఓ సారి ఆ హద్దును దాటి.. అధికారం దిశగానూ ప్రయత్నించారు. కానీ.. ఎన్నికల పోరులో చతికిలబడి.. శాసనసభలో ఒకే స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత సందర్భానుసారంగా జనాల్లోకి వెళ్తూ.. ప్రజా సమస్యలపై పోరాటాన్ని చేస్తున్నారు. అవి పార్టీకి ఎంత వరకూ మైలేజ్ ఇస్తున్నాయన్నదే.. శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ బలం, బలగం ముందు.. […]
ఆంధ్రప్రదేశ్ లో రహదారుల చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. దెబ్బతిన్న రహదారులపై.. విపక్షాలు సమరభేరి మోగిస్తుంటే.. అధికార పక్షం సైతం దీటుగా స్పందిస్తూ.. టగ్ ఆఫ్ వార్ గా ముందుకు వెళ్తోంది. అవసరమైతే అప్పులు సైతం తీసుకునైనా రోడ్లు బాగు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంటే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నాయి.ఇప్పటికే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయమై మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఉధృతంగా ప్రచారంలోకి […]
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్… నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన ఆయన… కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. KRMB, GRMBల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని… అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆరు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్… వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు. నిన్న […]
బతికి ఉన్నప్పుడు ఏ భర్తయినా..భార్యను ప్రేమిస్తాడు. ఐతే..చనిపోయిన తర్వాత కొంతమంది భర్తలు మాత్రమే భార్య జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే చంద్రగౌడ్. ఇంతకీ..ఆయన మరణించిన తన భార్యను ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా?సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్‌పల్లికి చెందిన చంద్రగౌడ్, రాజమణి భార్య భర్తలు. చంద్రగౌడ్ వృత్తిరీత్యా నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి రిటైర్ అయ్యాడు. వీరికి ఇద్దరు కొడుకులు..ఒక కూతురు. చంద్రగౌడ్‌కు భార్య అంటే ఎంతో ప్రేమ. ఆమెను కంటికి […]