ప్రపంచానికి హానికరంగా మారిన ఉగ్రవాదులను ఎదురించే దమ్ము అగ్రరాజ్యాలకు సైతం లేదని అప్ఘన్ సంఘటన నిరూపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రసంగాలతో దంచికొట్టే దేశాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయుధ సంపత్తిలో మేటిగా ఉన్న చైనా, అమెరికా లాంటి దేశాలు తాలిబన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికీ వారు సొంత ప్రయోజనాలతో తాలిబన్లకు పరోక్షంగా మద్దతు ఇస్తుండటం ప్రస్తుత అప్ఘన్ దుస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ పరిణామాలన్నీ […]
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 37,875 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,96,718 కి చేరింది. ఇందులో 3,22,64,051 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా… 3,91,256 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 39,114 మంది డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇకపోతే, 24 గంటల్లో 369 మంది మృతి చెందారు. దీంతో […]
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,54,997 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 56,635 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 876.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 170. 6640 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ […]
అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు. 1996 లో ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు ఈడీ విచారణ కు హాజరుకానున్నారు హీరో దగ్గుబాటి రానా. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈడీ ముందుకు రానున్నాడు హీరో రానా. ఇక ఇప్పటికే 12 సినీ ప్రముఖుల్లో నలుగురిని విచారణ చేశారు ఈడీ అధికారులు. ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మొట్ట మొదటి సరిగా నోటీసులు అందుకున్నాడు హీరో రానా. అయితే.. ఇవాళ్టి విచారణలో డ్రగ్స్ వ్యవహారం, మనిలాండరింగ్ వ్యవహారం పై హీరో రానాను ప్రశ్నించునున్నారు ఈడీ అధికారులు. ఇక […]
ఢిల్లీ : నేడు రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశం లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు నేతలు. అలాగే… తెలంగాణలో ప్రజా సమస్యల పై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణ పై సమాలోచనలు చేయనున్నారు. ఇక ఈ నేపథ్యం లోనే ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాహుల్ తో సమావేశం కానున్నారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పిసిసి […]
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. ఇవాళ్టి నుంచి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది… ఇవాళ్టి నుంచి అలిపిరి వద్ద రోజు కి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టీటీడీ.. కాగా, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ […]
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 8 రోజులుగా ఢిల్లీలో బిజీబిజీ గా ఉన్న సీఎం కేసీఆర్…. ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ బయల్దేరనున్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసిఆర్…. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ట్ర సమస్యలు, అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహాయం పై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలలో పాల్గొన్న తెలంగాణ సీఎం… కేంద్ర రహదారుల మంత్రి […]
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 44,400 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం […]