ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ముందస్తు ఎన్నికల ప్రచారమే జరుగుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎలాగైతే ముందుస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారో? అదే రీతిన సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందని టాక్ విన్పిస్తోంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నపుడు ఎన్నికలకు వెళితే గెలుపు తథ్యమని కేసీఆర్ నిరూపించారు. ఈ ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని […]
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక గడువు దగ్గర పడుతున్న కొద్ది.. అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నికల పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని ప్రకటించింది పూనమ్ కౌర్. తాను చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న […]
కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. దాంతో సహజంగానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే దర్శకులు, నిర్మాతలు ఎక్కువయ్యారు. అయితే కొందరు తమలోని పేషన్ ను విస్త్రత పరిధిలో ప్రేక్షకులకు చేర్చాలనే భావనతో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను సైతం థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలా ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చిందే ‘ది రోజ్ విల్లా’ మూవీ. డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), అతని భార్య, రచయిత్రి శ్వేత […]
ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే… ఇందులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండీషన్స్ అంచనా వేసిన..పంజాబ్ కింగ్స్… మొదట బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మొదట గా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోకి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుండగా… రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం […]
తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి… తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 220 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 244 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,66, 183 కు చేరగా… రికవరీ కేసులు […]
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అయితే ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధమే తెలంగాణలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారానికి దూరమవడానికి కారణమనే వాదనలున్నాయి. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా నేతల వైఖరే ప్రస్తుత పరిస్థితికి కారణమనే ప్రచారం జరుగుతోంది. ‘కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించలేరు.. కాంగ్రెస్ వాదులు తప్ప’ అన్న నానుడిని తెలంగాణ నేతలు అక్షరాల నిజం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు […]
ఏపీలో ఇవాళ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56, 463 శాంపిల్స్ పరీక్షించగా.. 809 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 10 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో 1,160 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,83,50, 167 కరోనా నిర్ధారణ […]
తొలి చిత్రం ‘ఉప్పెన’తో చక్కని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, రవిప్రకాశ్, హేమ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘కొండపొలం’ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ నవలా చిత్రాన్ని ఇదే నెల 8న ప్రపంచ వ్యాప్తంగా […]
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆగస్ట్ లో సినిమాలు థియేటర్లలో విడుదల కావడం మొదలైంది. ఆ నెలలో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’, ‘రాజ రాజ చోర’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలను ప్రేక్షకులు కాస్తంత ఆదరించారు. అయితే…. అసలైన ఊపు సెప్టెంబర్ మాసంలో వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో అనువాద చిత్రాలతో కలిసి ఏకంగా 31 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఇందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు 20 కాగా, వివిధ భాషల […]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ చాలా రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. అయితే… ఇవాళ పలు కీలక బిల్లులు తెలంగాణ అసెంబ్లీ లో ఆమోదం పొందాయి. ఇందులో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2021 ను.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టగా… ది తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ టౌటింగ్ అండ్ మాల్ప్రాక్టీస్ అగైనెస్ట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రవేశట్టారు. ఈ రెండు బిల్లులు మొదట ఆమోదం పొందగా….మంత్రి వేముల ప్రశాంత్ […]