రోజు రోజు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు.. గత వారం రోజుల నుంచి విపరీతంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 43,800కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 47,780 కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ. 300 పెరిగి రూ. 65,200 కి చేరింది. దసరా మరియు దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.