బీజేపీ పార్టీకి అంబర్ పేట్ లో బీఆర్ఎస్ వరుస షాకులు ఇస్తుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి కమలం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు జాయిన్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులపై అమ్ముడు పోయారని బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ పనికి మాలినవని ఏనుగులు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయని వాటిని పట్టించుకోకూడది మంత్రి తలసాని అన్నారు. మాటెత్తితే జైశ్రీరామ్ అనే మీరు అదే శ్రీరాముడుపై ఒట్టేసి మీరు చేస్తున్న ఆరోపణలు రుజువు చేసుకుంటారా అని సవాల్ చేశారు.
Read Also: Rebel: ప్రభాస్ టైటిల్ తో వస్తున్న కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
ఇదే, అంబర్ పేట్ లో కిషన్ రెడ్డి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చేతిలో ఓడిపోవడంతో అదృస్టం కలిసొచ్చి ఎంపీవి అయ్యి ఆ తర్వాత క్యాబినెట్ మినిస్టర్ వి అయ్యి ఒక్కసారి కూడా నియోజకవర్గం వైపు మళ్లీ చూసిన పాపాన పోలేదు.. ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి ఏం చేసావో చెప్పాలని మంత్రి తలసాని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చే సరికి ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చి ఓట్లు అడ్డుకొని గెలిచిన వెంటనే ఢిల్లీ కి కిషన్ రెడ్డి వెళ్లిపోతాడని ఆయన ఆరోపించారు. అంబర్ పేట్ ప్రజలు మరోసారి చిత్తుచిత్తుగా కిషన్ రెడ్డిని ఓడిస్తారన్న భయంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. మీరు ఎమ్మెల్యేగా చేసిన హయాంలో జరిగిన అభివృద్ధికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉన్నానని కిషన్ రెడ్డికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు.
Read Also: NIA Court: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు.. 11 మందికి పదేళ్లు జైలు శిక్ష
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును చూసే పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. అంబర్ పేట్ లో గత 20 సంవత్సరాల్లో ఒక్క కార్యకర్తను నాయకుడిని పట్టించుకోకపోవడం వల్లే నేడు బీజేపీలో పోటీ చేయడానికి ఒక్క నాయకుడు లేకుండా పోయారని ఎమ్మెల్యే ఆరోపించారు. బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి అత్యంత స్వార్థపరుడు.. అన్ని పదవులు తనకే కావాలన్న దురాశ కలిగిన వ్యక్తి అంటూ ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ, క్యాబినెట్ మినిస్టర్ నుంచి పార్టీ అధ్యక్షుడు వరకు అన్ని తనకే కావాలంటే పార్టీని నమ్ముకొని 40 సంవత్సరాలుగా పని చేస్తున్న నాయకులు ఎమ్ కావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రశ్నించారు.