టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీఎమ్డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు.
తెలంగాణలో రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ కాళేశ్వరం సందర్శన వెళ్లిన తర్వాత అనేక నిజాలు బయటపడుతున్నాయి.
నమల ప్రతి 15 రోజులకు అప్పుల విషయం మాట్లాడుతున్నారు ఎందుకని మంత్రి బుగ్గన అడిగారు. మాజీ మంత్రి గంటా కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.. టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పును కూడా మాకు అంటగట్టడం అన్యాయం.. 2023 సెప్టెంబర్ వరకూ 4 లక్షల 50 వేల కోట్ల అప్పు ఏపీకి ఉంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోసమే కేసీఆర్ వ్యాఖ్యలు.. ఏడు విలీన మండలాల ప్రజలు మళ్ళీ తెలంగాణకు వెళతారా అని ఎవరో అడిగితే మేం వెళ్ళమని స్పష్టం చేశారు అని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు కత్తులతో దాడి చేస్తున్నారు అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ అంటున్నారు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నారు.. మూడు గంటలు కావాలా 24 గంటల కరెంట్ కావాలా అని ఆయన ప్రశ్నించారు.
ఏపీ హైకోర్టు ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు అని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. దీని వల్ల పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ ఆయన కలవరు అని అచ్చెన్న పేర్కొన్నారు.
రుషికొండ నిర్మాణాలపై మరోసారి ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి ఎంక్వైరీ చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
భారత మాజీ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్కి మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ముందు సచిన్ టెండూల్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి.